మంచాల, జూన్ 8 : ఆగపల్లి, కాగజ్‌ఘట్ గ్రామాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేశారు. ఎంపీపీ నర్మద కార్యక్రమాన్ని ప్రారంభించారు. 500ల జీవాలకు మాత్రలు వేశారు. కార్యక్రమంలో గోసుల జంగయ్య, యాదయ్య, పశువైద్యాధికారి డాక్టర్ సుధా, సిబ్బంది శ్రీశైలం, రాంచందర్, శివరాజు తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : మొత్కులగూడలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మాత్రలు వేశారు. జీవాలకు తప్పనిసరిగా నట్ట నివారణ మాత్రలు వేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు కట్న లత, మండల పశువైద్యాధికారి సునీత, సర్పంచ్ ఎల్లమ్మ, టీఆర్ఎస్ నాయకులు కట్న శ్రీశైలం, నర్సింహ, రైతులు పాల్గొన్నారు.
నట్టల నివారణ మందులు ..
మొయినాబాద్ : పేద ప్రజలను, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీశ్రీకాంత్ అమ్డాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ డాక్టర్ దేవిరెడ్డి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్ సర్పంచ్ బూర్గు రవళితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగార్జునాచారి, నాయకులు గోపికృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కుంట్లూరులో..
పెద్దఅంబర్‌పేట, జూన్ 8: హయత్‌నగర్ పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో బుధవారం కుంట్లూరులో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 1785 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాగించారు. ఈ మందు వల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయని, సరాసరి 3 కిలోల బరువు పెరుగుతాయని, మరణాల శాతం తక్కువగా ఉంటుందని పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనంద్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చామ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్లు గీత, సుజాత, నాయకులు విజయశేఖర్‌రెడ్డి, శ్రీరాములు, సిబ్బంది నర్సింహ, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
మంచాల : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయించాలని ఎంపీపీ జాటోతు నర్మద అన్నారు. ఆగపల్లి, కాగజ్‌ఘట్ గ్రామాల్లో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందుల కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రారంభించారు. అదేవిధంగా ఆగపల్లి, కాగజ్‌ఘట్ గ్రామాల్లో 500ల గొర్రెలు, మేకలకు మందులను వేశారు. కార్యక్రమంలో జంగయ్య, యాదయ్య, పశువైద్యాధికారి డాక్టర్ సుధ, సిబ్బంది శ్రీశైలం, రాంచందర్, శివరాజు తదితరులు పాల్గొన్నారు.
తప్పనిసరిగా వేయించాలి
శంకర్పల్లి : గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందును తప్పని సరిగా వేయించాలని కౌన్సిలర్ చాకలి అశోక్ అన్నారు. మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ శాంతమ్మ, ఆగయ్య, నాగభూషణం పాల్గొన్నారు.