షాద్‌నగర్‌టౌన్, జూన్ 5 : పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలోని 27 వార్డు మరింత సుందరంగా మారుతున్నదని కౌన్సిలర్ కౌసల్యాశంకర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఆదిత్య, శ్రీరామ్, రామచంద్రయ్య, ఈశ్వరయ్య, వెంకటయ్య, జంగయ్య, కృష్ణారెడ్డి, వెంకటయ్య, రాఘవేందర్, మోహన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఊరూరా ముమ్మరంగా పల్లె ప్రగతి
యాచారం : అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామా ల్లో పర్యటించి సమస్యలను గుర్తించారు. సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించారు. మల్కీజ్‌గూడ, మేడిపల్లి గ్రామాల్లో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి పర్యటించారు. నందివనపర్తిలో సర్పంచ్ ఉదయశ్రీ ఆధ్వర్యంలో చెత్తా చెదారాన్ని, కలుపు మొక్కలను తొలగించారు. మొండిగౌరెల్లిలో సర్పంచ్ బండిమీది కృష్ణ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులను ముమ్మరంగా చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, యాదమ్మ, ఎంపీటీసీ శివలీల, శారద పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : పల్లెలు, పట్టణాలు ఆదర్శంగా రూపుదిద్దు కోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వెనుకాల చెత్త చెదారం, కలుపు మొక్కలను తొలగించి, తడిపొడి చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలించారు. అదేవిధంగా దామరిగిద్దలో సర్పంచ్ వెంకటేశంగుప్తా ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శైలజ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, కార్యదర్శి వెంకట్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాలనీలను శుభ్రంగా ఉంచాలి
పెద్దఅంబర్‌పేట : పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, కమిషనర్ రామాంజులరెడ్డి కోరారు. ఆదివారం 13వ వార్డు పరిధి హౌసింగ్‌బోర్డులో పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాలనీ వాసులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మద్ది నరేందర్‌రెడ్డి, మున్సిపల్ డీఈఈ అశోక్‌కుమార్, అధికారులు రాజు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులు
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కొనసాగాయి. మురుగు కాలువలు శుభ్రం చేసి, చెత్తాచెదారాన్ని ఎత్తి వేశారు. ఎంపీవో విజయ్‌కుమార్ పాల్ సూచనలు చేశారు.
పల్లెప్రగతితో సంపూర్ణ అభివృద్ధి
కడ్తాల్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, తండాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని కడ్తాల్, నార్లకుంట గ్రామాల్లో సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, పూజతో కలిసి ఎంపీడీవో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, అంగన్వాడీ, కంపోస్టు షెడ్డులు, పారిశుధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీవో మధుసూదనాచారి, నరేందర్‌రెడ్డి, మల్లయ్య, రాంచంద్రయ్య, మహేశ్, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలు సహకరించాలి
చేవెళ్లటౌన్ : ప్రజలు గ్రామాల్లో పారిశుధ్యానికి సహకరించాలని ఎంపీడీవో రాజ్ కుమార్ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో పర్యటించారు. పలు సూచనలు చేశారు.
పల్లె ప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధి
శంకర్పల్లి : పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని శేరిగూడ సర్పంచ్ సత్యనారాయణ అన్నారు. విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలకు మరమ్మతులు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, వార్డు సభ్యులు వెంకటేశ్, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సర్పంచ్ ఎర్రవెల్లి లతశ్రీగౌరీశంకర్ అన్నారు. మండలంలోని బాటసింగారం గ్రామంలో ఇంటింటికీ తిరిగి సమస్యలను తెలుసు కున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లతశ్రీగౌరీశంకర్, పంచాయతీ కార్యదర్శి అరుణ, వార్డు సభ్యుడు మారుతి తదితరులు పాల్గొన్నారు.