పరిగి, జూన్ 5: సీఎం కేసీఆర్ ప్రభుత్వం సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్స రం నుంచే ఒకటి-ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకు న్న ప్రభుత్వం ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ శిక్షణను పూర్తి చేసింది. జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాలలు-764, ప్రాథమికోన్నత పాఠశాలలు-116, ఉన్నత పాఠశాలలు -174, మోడల్ స్కూళ్లు-9, కేజీబీవీలు- 18, తెలంగాణ రాష్ట్ర గురుకులాలు- 26.. కలిపి మొత్తం 1107 బడులున్నా యి. ఈ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు చైల్డ్ ఇన్ఫో డాటా ఆధారంగా 8,11,170 పాఠ్యపుస్తకాలు అవసరమని నిర్ధారించి.. వాటిని అందించేందుకు చర్యలు చేపట్టింది.
8,11,170 పాఠ్య పుస్తకాలు
జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు 8,11,170 పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటో తరగతి పాఠ్యపుస్తకాలు మొత్తం ఆంగ్ల మాధ్యమంలో ఉండనుండగా.. రెండు నుంచి ఎనిమిదో తరగతికి చెందిన పుస్తకాలను ఒక పేజీ ఆంగ్లంలో.. పక్కనే ఉన్న మరో పేజీలో తెలుగు మాధ్యమంలో పాఠ్యాంశాలు ఉండేలా పుస్తకాలను ముద్రించా రు. దీనిద్వారా విద్యార్థులు ఆంగ్ల భాష ను సులభంగా అర్థం చేసుకొని పట్టు సా ధించే అవకాశం ఉంటుందని అధికారు లు భావిస్తున్నారు. కాగా జిల్లాకు ఒకటో తరగతికి సంబంధించి 36,450 పాఠ్యపుస్తకాలు, రెండు నుంచి ఎనిమిదో తరగతి వరకు 5,79,610, తొమ్మిది, పది తరగతులకు సంబంధించి 1,97,110 పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు నిర్ధా రించగా.. ఇప్పటివరకు వికారాబాద్‌లోని గోదాముకు 73,650 ఉచిత పాఠ్య పుస్తకాలు వచ్చాయి. మిగిలిన పుస్తకాలు వా రం, పది రోజుల్లో రానున్నట్లు పేర్కొంటున్నారు. 9,10 తరగతులకు సంబంధించి గతేడాదికి చెందిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించనున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కొత్తగా ప్రింట్ చేస్తున్నారు. వాటిని విడుతల వారీగా ఆర్టీసీ కార్గో సర్వీసుల్లో జిల్లాలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం దూరంగా ఉన్న జిల్లాలకు పాఠ్యపుస్తకాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మరో వారం, పది రోజుల్లో జిల్లాకు పూర్తిస్థాయి లో పుస్తకాలు రానున్నట్లు ..వచ్చిన వెం టనే మండలాల్లోని విద్యావనరుల కేం ద్రాని కి, అక్కడి నుంచి పాఠశాలలకు తరలిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో..
ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకటి -ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్న ప్రభు త్వం ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ శిక్షణను పూ ర్తి చేసింది. జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే 2104 మంది ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే 1057 మంది టీచర్లు శిక్షణను తీసుకున్నారు. దీంతోపాటు పాఠ్య పుస్తకాలను ఆంగ్ల భాషలో ప్రింట్ చేశారు. ఒకటో తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఆంగ్ల భాషలో.. రెండు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్లం, తెలుగు రెండు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలను ముద్రించారు. ఆంగ్లంలో చదివిన వెంటనే పక్కనే ఉన్న పేజీలో తెలుగులో చదవడం ద్వారా విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు అర్థమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు..
ఆంగ్ల మాధ్యమంలో బోధనతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరుగనున్నది. ఇప్పటివరకు ఆంగ్ల మాధ్య మం అంటేనే ప్రైవేట్ స్కూళ్లు అనే పరిస్థితి ఉండటంతో… తమకు ఆర్థిక స్థోమత లేకున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పం పించేవారు. ప్రస్తుతం తమ సొంత గ్రా మంలోని సర్కారు బడిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందుబాటులోకి రానుండటంతో ప్రైవేట్ బడుల నుంచి అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరే అవకాశం ఉన్నది. గతేడాది సుమారు 20 వేల మందికి పైగా విద్యార్థులు సర్కారు బడుల్లో చేరగా.. ఈసారి మరింత మంది పెరిగే అవకాశం ఉంది.