రంగారెడ్డి, జూన్ 4(నమస్తే తెలంగాణ): జిల్లాకు మరో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరయ్యింది. జిల్లాలోని రాజేంద్రనగర్‌కు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటివరకు ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రమే ఉండటంతో ఈ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు డిగ్రీ చదువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పలుమార్లు సీఎం కేసీఆర్‌కు విన్నవించడంతో స్పందించిన ఆయన డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. కాగా ఏడాదిలోగా కళాశాల భవనాన్ని నిర్మించడంతోపాటు వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ తరగతులను ప్రారంభించేందుకు అధికారు లు కసరత్తు చేస్తున్నారు. డిగ్రీ కళాశాల భవ న నిర్మాణానికి శంషాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిధిలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే.. మౌలిక వసతులకు సంబంధించిన విషయాలను ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నా రు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డికి ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.