కోట్‌పల్లి, మే 31: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మంగళవారం మండలంలోని కరీంపూర్ గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా వారు పర్యటించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను తీర్చేందుకే ‘మీతో నేను’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.. ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక సర్పం చ్, పార్టీ మండల అధ్యక్షుడు అనిల్‌కుమార్‌తో కలిసి వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆనంద్ మరి కొన్ని చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామంలో నెలకొన్న విద్యు త్ సమస్యలు వారి దృష్టికి తేగా అక్కడే ఉన్న ఏఈతో ఈ సమస్యను వారంలోగా పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామానికి వికారాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సును ఉదయం, సాయంత్రం రెండు పూటలా నడుపాలని గ్రామస్తులు కోరగా వెంటనే ఎమ్మెల్యే ఆర్టీసీ డీఎంతో ఫోన్లో మాట్లాడారు.
అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రూ. 15లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ. ఐదులక్షల తో ఏర్పాటు చేసిన ఫార్మేషన్ రోడ్డు, రూ. ఐదులక్షలతో నెలకొల్పిన స్ట్రీట్ లైట్లు, కొత్త హంగులతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని వారు ప్రారంభించారు. అలాగే గ్రామంలో రూ. లక్షతో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించినారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమాదేవి, మం డల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, వైస్ చైర్మన్ దశరథ్‌గౌడ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌యాదవ్, రైతు సంఘం అధ్యక్షుడు సత్యం, ఆయా గ్రామాల సర్పంచులు మల్ల య్య, రాంచందర్, సూర్యకళ, అనితారెడ్డి, పద్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.