కోట్‌పల్లి, మే 29: గత చరిత్రకు ఆనవాళ్లుగా పురాతన కట్టడాలు నిలుస్తున్నాయి. పురాతన కట్టడాలను శిథిలావస్థకు చేరకుండా చూస్తే ఇక ముందు కూడా వాటి ఆవశ్యకత చరిత్రలో నిలిచిపోనున్నది. ఎందుకంటే నేటి టెక్నాలజీలో ఎన్ని అంతస్తుల భవనాలను నిర్మించినా నాటి కట్టడాలకు సమానం కాద ని చరిత్ర చెబుతున్నది. శతాబ్దాల కిందట గ్రామాల ను శత్రువులు, దొంగల బారి నుంచి కాపాడుకునేం దుకు గ్రామ రక్షక దళాలు, సైనికులు గట్టి నిఘాతో బురుజులపై ఉండి శాంతిభద్రతలు కాపాడేవారు. ఇలాంటి బురుజులు ప్రతి గ్రామంలోనూ చిన్నవో, పెద్దవో తప్పనిసరిగా దర్శనమిస్తుంటాయి. గ్రామాల ప్రవేశ ద్వారం చుట్టూ కందకాలతో కట్టుదిట్టమైన భద్రత ఉండేది.
కాలక్రమేణా ఆధునిక మార్పుల కారణంగా బురుజులు, గౌనిలు అంతరించిపోతున్నా యి. మండల కేంద్రం కోట్పల్లితోపాటుగా ఓగ్లాపూ ర్, మోత్కుపల్లి, ఎన్నారం, బార్వాద్, రాంపూర్ తదితర గ్రామాల్లో బురుజులు ముళ్ల కంచెలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో బీటలువారి కూలిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఎంతో పటిష్టంగా నిర్మించిన ఆ కట్టడాలను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. గత చరిత్రకు ఆనవాళ్లు గా అవి మనకు నేటికీ దర్శనమిస్తున్నాయి. పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిపై పెరిగిన చెట్లు, చెత్తాచె దారాన్ని తొలగించి వాటికి మరమ్మతులు చేసి ముందు తరాలకు చారిత్రక కట్టడాల విశిష్ఠతను తెలుపాల్సిన బాధ్యత మనపై ఉందని పలు గ్రామాల వాసులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఘనమైన చరిత్ర ..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఘనమైన చరిత్ర ఉన్నది. ఈ జిల్లా భూభాగాన్ని రాజవంశస్తులెందరో పరిపాలించారు. ఆ కాలంలో పాడి పంటలు, వన సంపదతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని మా తాతగారు చెప్పేవారు. చరిత్ర పొడుగునా రాజులెందరో ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. శాతవాహనులు ఈ జిల్లా భూభాగాన్ని తమ సామ్రాజ్య అంతర్భాగంగా మార్చుకున్నా రు. పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు, మొగలులు, కుతుబ్‌షాహీలు ఇలా అనేక మంది రాజులు ఈ జిల్లాను పరిపాలించారు.
– శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ, కోట్‌పల్లి మండలం