తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19: సాహిత్య రంగంలో యువత కనిపించడం లేదనే వాదనకు తెలంగాణ సారస్వత పరిషత్తు నడుం బిగించి పా ఠశాల స్థాయి నుంచే వందలాదిగా కవులు, రచయితలను తయారుచేసేందుకు పూనుకోవడం హర్షణీయమని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు మొదటిసారిగా రాష్ట్ర స్థాయి పాఠశాలల విద్యార్థులకోసం నిర్వహించిన కవిత, కథా, రచ న పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్స వం శుక్రవారం పరిషత్తు ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళా ప్రాంగణంలో జరిగిం ది. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సాహిత్యం, ఇతర రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పరిష త్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకతశక్తిని పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు అనేక కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టిందన్నారు.
అనంతరం పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య మాట్లాడుతూ కొవిడ్ కాలంలోనూ విద్యార్థుల నుంచి పోటీలకు అనూ హ్య స్పందన వచ్చిందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత వెంకటరమణ మాట్లాడుతూ భవిష్యత్లో మరిన్ని మంచి కవితలు వచ్చేందు కు ఈ పోటీలు తోడ్పడుతాయన్నారు. బాలచెలిమి వ్యవస్థాపకుడు వేదకుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే పిల్లలు ఉత్సాహంగా రచనలు చేస్తున్నారన్నారు. బాల సాహితీవేత్త వెంకటరమణ మాట్లాడుతూ చిన్నారులు రచనారంగంలో రాణించాలని సూచించారు. బాలసాహితీవేత్తలు డాక్టర్ శర్మ, డాక్టర్ సిరి న్యా యనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీల విజేతలకు ఐదు వేలు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి(మూడువేలు), తృతీయ బహుమతి(రెండువేలు), ప్రత్యేక బహుమతి కింద రూ. వెయ్యి నగదుతోపాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాల తో సత్కరించారు. పరిషత్తు కోశాధికారి రామారావు, ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిల్మానాయక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్యేక బహుమతులు
సింధు (రంగారెడ్డి జిల్లా మాలికదానిగూడ), గోపాల్(రంగారెడ్డి జిల్లా మహేశ్వరం) వక్తల నుంచి అవార్డులు అందుకున్నారు.