షాద్నగర్టౌన్, మే 26 : తెలంగాణ ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆస్తి పన్ను వసూలుపై షాద్నగర్ మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టిసారించింది. ఆస్తి పన్ను చెల్లింపునకు సంబంధించి ఎప్పటికప్పుడూ ప్రజలకు అర్థమయ్యేలా మున్సిపాలిటీలో విస్తృతంగా ప్రచారాలు నిర్వహించడంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విజయవంతమయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు ఆస్తి పన్ను వసూళ్లలో షాద్నగర్ మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. గతంలో రెండు జాతీయ అవార్డులతో పాటు రాష్ట్రస్థాయి అవార్డును షాద్నగర్ మున్సిపాలిటీ సొంతం చేసుకుంది. ఇటీవలే 90.33 శాతంపైగా ఆస్తి పన్నులను వసూలు చేసి 2021-22పట్టణ ప్రగతి పురస్కారాల్లో రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డును అందుకున్నది. ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచింది. ఆస్తి పన్నుతో పాటు వివిధ రకాల పన్నులను సకాలంలో వసూలు చేసినందుకుగాను షాద్నగర్ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు రావడంపై మున్సిపల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి అవార్డు
షాద్గనర్ మున్సిపాలిటీలో 2021-22 సంవత్సరానికి ఆస్తి, వివిధ రకాల పన్ను వసూలుకు ఉన్న లక్ష్యం రూ. 4 కోట్ల 24 లక్షల 94 వేలకు రూ. 3 కోట్ల 83 లక్షల, 85 వేలను వసూలు చేసింది. అదే విధంగా 2022-23 సంవత్సరానికి సంబంధించి 5శాతం రాయితీతో రూ. 1. 3 కోట్ల పన్ను వసూలు చేశారు. 2021-22 పట్టణ ప్రగతి పురస్కారాల్లో షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ జయంత్కుమార్రెడ్డిలకు ఇటీవలే రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అవార్డును ప్రదానం చేశారు.
సిబ్బంది కృషి అభినందనీయం
ఆస్తిపన్ను చెల్లింపునకు ఎప్పటికప్పడూ మున్సిపాలిటీలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాం. ఆస్తి పన్ను వసూలుకు పట్టణ ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించారు. ఆస్తి పన్ను వసూలుకు కృషి చేసిన సిబ్బంది పనితీరు అభినందనీయం. రాష్ట్రస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉంది.
-జయంత్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్
ప్రజల సహకారం భేష్
ప్రజల సహకారంతోనే మున్సిపాలిటీలో 90.33శాతం ఆస్తి పన్ను వసూలైంది. పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి. మున్సిపాలిటీలో పన్ను వసూలుకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేశారు.
-కొందూటి నరేందర్, మున్సిపల్ చైర్మన్ షాద్నగర్