ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు
ధారూరు, మే 22: ‘పల్లె ప్రగతి’ ధారూరు మండలంలోని మోమిన్‌కలాన్ గ్రామ రూపు రేఖ లను మార్చింది. పల్లెప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వి ని యోగం చేసుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామంలో పల్లె ప్రగతిలో భా గంగా డంపింగ్‌యార్డును ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో ట్రాక్టర్ కొను గోలు చేసి, ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. తడి-పొడి చెత్తను వేరు చేసి సేం ద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.చెత్తను వేరు చేసేందుకు ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసి కొత్త వెలుగులు తీసుకొచ్చారు. పంచాయతీ సిబ్బంది వీధులను రోజూ శుభ్రం చేస్తున్నారు.
గ్రామాభివృద్ధికి పంచాయతీ నిధులతో పాటు అన్ని రకాల పన్నుల వసూలు చేసేందుకు కృషి చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలను నాటి వాటి చుట్టూ కంచే వేశారు. వాకింగ్ చేయడానికి రోడ్డు, విశ్రాంతి తీసు కునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. గ్రామ నర్సరీలో టేకు, తులసీ, జామ, టైకోమా, జీడి, నిమ్మ ఖర్జూర, ఉసిరి తదితర మొక్కలను పెంచుతున్నారు. మిషన్ భగీరథ పథకం కింద ట్యాంక్ నిర్మించి ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి తాగు నీటికి ఇబ్బందులు లేవు. పల్లె పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దే శంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికా రులు, ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. రైతుల సమ స్యలు తక్షణమే పరి ష్కరించేందుకు క్లస్టర్ స్థాయిలో రైతు వేదికను రూ. 22 లక్షలతో నిర్మించారు.
గ్రామ అభివృద్ధే లక్ష్యం
గ్రామ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా, రాజకీయాలకు అతీతంగా పని చేస్తు న్నాం. గ్రామంలో మరిన్ని కార్యక్ర మాలు చేపట్టి మండలంలోనే ఆదర్శ గ్రామ పంచా యతీగా తీర్చిదిద్దుతాం. గ్రామస్తులు, వార్డు సభ్యులు, అధికారుల సమష్టి కృషితోనే అన్ని రం గాల్లో గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించాం. గ్రామ అభి వృద్ధికి సహ రించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు
–జి. శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్, మోమిన్‌కలాన్
చాలా సంతోషంగా ఉంది..
పల్లె ప్రగతి పథకంతో గ్రామ రూ పురేఖలు మారాయి. గ్రామంలో ము నుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్, గ్రామనర్సరీ, పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగు నీరు సరఫరా చేయడం, హరిత హారం కార్యక్రమంలో భాగంగా రోడ్డు కు ఇరువైపులా మొక్కలునాటడం చాలా సంతోషంగా ఉంది. -నందిని శ్రీనివాస్, ఉపసర్పంచ్ అందరి సహకారంతోనే..
గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి విజయవంతంగా సాగింది. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అం దించారు. పార్టీలకతీతంగా పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధానత్యనిస్తున్నాం. ప్రతి రోజూ వీధులన్నీ శుభ్రం చేయిస్తున్నాం
–పూర్ణిమ, పంచాయతీ కార్యదర్శి