కొడంగల్, మే 9: కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సొంత ఖర్చులతో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ అందిస్తున్నారు. నియోజకవర్గంలో కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాలు ఉన్నాయి. కోస్గి అందరికీ అందుబాటులో ఉండడంతో కోస్గి మున్సిపల్ కేంద్రంలో కోచిం గ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని పీజేఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకు లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఐదు మండలాలకు చెందిన 350 మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. వీరికి ప్రతి రోజు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు పీజేఆర్ కోచింగ్ సెంటర్ ద్వారా స్టడీ మెటీరియల్ ను అందిస్తున్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధిస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోచింగ్ తీసుకోవడానికి పట్టణ ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వచ్చేదని, నేడు అటువంటి పరిస్థితి లేకుండా ప్రజా ప్రతినిధులు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ అందించడం చాలా సంతోషంగా ఉందని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తమ శిక్షణ అందిస్తున్నాం
కొడంగల్ ప్రాంత నిరుద్యోగులు హైదరాబాద్ వంటి పట్టణాలను వెళ్లి శిక్షణ తీసుకోవాలంటే చాలా కష్టం. ఇక్కడే హైదరాబాద్‌లోని పీజేఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నాం. ఈ ప్రాంత నిరుద్యోగులు అధికంగా ఉద్యోగాలను సాధిం చి ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్ష్యం. మొత్తం 350 మందికి కోచింగ్ ఇస్తు న్నాం. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.
-పట్నం నరేందర్‌రెడి, ఎమ్మెల్యే
గ్రూప్స్‌లో జాబ్ సాధిస్తా..
గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు కార్పొరేట్ తరహాలో ఉచిత శిక్షణ ఏర్పా టు చేయడం చాలా సంతోషం. లక్ష్యం ఉన్నా పోటీ పరీక్షలకు ప్రణా ళిక ముఖ్యం. ఖర్చులేకుండా కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. గ్రూప్స్ లక్ష్యంగా చదువుతు న్నా.. కోచింగ్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఉద్యోగాన్ని సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది.
-హర్షవర్ధన్, నాగసాన్పల్లి.
పోలీసు ఉద్యోగమే లక్ష్యం
పోలీస్ కావాలన్నదే నా లక్ష్యం. సరైన గైడెన్స్ లేక ఉద్యోగాన్ని సాధించలేక పోతున్నాం. కోచింగ్ తీసుకోవాలంటే వేలకు వేలు ఖర్చు చేసి పట్టణ ప్రాం తా లకు వెళ్లి శిక్షణ తీసుకోవాల్సి వచ్చేది. పరిస్థితులు అను కూలంగా లేని కారణంగా శిక్షణ తీసుకోలేక పోయా. ప్రస్తుతం ఎమ్మెల్యే కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయ డం చాలా సంతోషంగా ఉంది. అధ్యాపకులు అన్ని విష యాలను బోధిస్తున్నారు.
-నరేశ్, కోస్గి