కడ్తాల్, మే 1 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని, బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చరికొండ గ్రామ సర్పంచ్ భారతమ్మానర్సింహాగౌడ్ ఆధ్వర్యంలో రమేశ్‌గౌడ్, అనిల్, వెంకటయ్య, వెంకటేశ్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు జంగయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు యాదయ్య, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సాబేర్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నర్సింహ, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు నరేశ్‌గౌడ్, నాయకులు ఎల్లయ్య, జంగయ్య, మైసయ్య, నర్సింహ, శ్రీనివాస్, శ్రీనునాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుల వృత్తులకు ప్రభుత్వం పెద్దపీట
కడ్తాల్, మే 1, (ఆమనగల్లు) : కుల వృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌడ సంఘం, యాదవ సంఘం భవన నిర్మాణాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరైన ప్రొసీడింగ్స్‌ను కుల సంఘాల నాయకులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాటమయ్య దేవాల యం ఆవరణలో చేపట్టిన గీతా కార్మిక భవన నిర్మాణ పనులకు, యాదవ సంఘం భవన నిర్మాణాల పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, యాదవ, గౌడ సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
అంతరించిపోతున్న కుల వృత్తులకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పూర్వ వైభ వం వస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలీ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మ న్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్, కౌన్సిలర్ యా దమ్మ, గౌడ సంఘం అధ్యక్షుడు అల్లాజీగౌడ్, నాయకులు రవీందర్‌గౌడ్, నిరంజన్‌గౌడ్, నారాయణగౌడ్, యాదయ్యగౌడ్, బాలకృష్ణగౌడ్, శ్రీశైలంయాదవ్, లక్ష్మీపతిగౌడ్, వెంకటయ్యగౌడ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ రంగయ్య మృతి తీరని లోటు
తలకొండపల్లి : మాజీ సర్పంచ్ రంగయ్య మృతి తీరని లోటని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ రంగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్‌గా రంగయ్య చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.