కడ్తాల్, మే 1: మండల కేంద్రంలో ఆదివారం మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కడ్తాల్ పట్టణంలోని అన్మాస్‌పల్లి చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పుష్ప స్థానిక కార్మికులతో కలిసి సీఐటీయూ జెండాను ఎగురవేశారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను సన్మానించి చీరెలను అందజేశారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ప్రధాన చౌరస్తాలో సీఐటీయూ నాయకులు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కవిత, చందోజీ, లాలూనాయక్, మల్లేశ్, రాఘవేందర్, చంద్రశేఖర్‌రావు, లాయక్‌అలీ, దాసు, శంకరయ్య, మల్లేశ్‌గౌడ్, రాంచందర్‌నాయక్, నర్సింహ, దాసు, రాజు, మల్లయ్య, చెన్నయ్య, లక్ష్మమ్మ, రామస్వామి పాల్గొన్నారు.
షాబాద్ : కార్మిక చట్టాలు వారి అభివృద్ధికి దోహదపడాలని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మేడే సందర్భంగా కార్మికులతో కలిసి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…1886లో అమెరికాలోని చికాగో నగరంలోని హే మార్కెట్లో 8 గంటల పనివిధానం కోసం, కార్మిక హక్కులు కాపాడాలని సుదీర్ఘపోరాటాలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి నక్కలి జంగయ్య, సహాయ కార్యదర్శి రఘురాం, నాయకులు రాములు, రుక్కయ్య, శివ, మధు, రామకృష్ణ, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
కొత్తూరు : కార్మికుల హక్కుల పరిరక్షణలో టీఆర్ఎస్ ముందుంటుందని కార్మిక నాయకులు మారబోని సాయిలు యాదవ్ అన్నారు. మే డే సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని విజయలక్ష్మి బస్టాప్ వద్ద టీఆర్ఎస్ నాయకులు ఆదివారం టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్ యాదవ్, జొల్లు బాలయ్య, ప్రవీణ్, మాధవరెడ్డి, నర్సింహారెడ్డి, కృష్ణ, జైపాల్, రాఘవేందర్, రవినాయక్, శ్రవణ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఐవోసీఎల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో…
ఐవోసీఎల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మే డే వేడుకల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు సాయిబాబా, ఐవోసీఎల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు శ్రీను, గోపాల్, బాబు, శ్రీనివాస్, ప్రవీణ్, సుధాకర్‌రెడ్డి, రఘు, ఆంజనేయులు, వెంకటేశ్, మల్లయ్య పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల వ్యాప్తంగా మేడే వేడుకలను నిర్వహించారు. కార్మిక సంఘాల జెండాలను ఎగురవేసారు. కార్యక్రమంలో ఏఈ ఓంబీర్సింగ్ కఠారియా, కృష్ణ, వస్యానాయక్, నరేశ్, శ్రీనివాసులు, వాల్యానాయక్, చంద్రయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లో ఘనంగా మే డే
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడే ను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో కార్మికులు వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రజెండాలను ఎగురవేశారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మే డేను ఘనంగా జరుపుకున్నారు.
చేవెళ్లటౌన్ : ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి, జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి సంఘం జెండాను ఆవిష్కరించారు. అనేక్స్ గ్లాస్ కంపెనీలో మే డే ను నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ప్రభులింగం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, మండల కార్యదర్శి సుధాకర్, శివయ్య. మహిళా అధ్యక్షురాలు మంజుల పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్ : వివిధ గ్రామాల్లో మేడే వేడుకలను ఆయా పార్టీల అనుబంధ సంఘం కార్మిక నాయకులు ఘనంగా నిర్వహించారు. నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మారవోని సాయిలు, దేవేందర్, బాలయ్య, జైపాల్, రవినాయక్, మాధవరెడ్డి, బండి శ్రావణ్, రాఘవేందర్ పాల్గొన్నారు.
శంకర్పల్లి : సీఐటీయూ డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్ సమక్షంలో జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు జంగయ్య, శంకర్పల్లి మున్సిపల్ సీఐటీయూ యూనియన్ నాయకులు రమేశ్, రాములు, శ్రావణ్, రాజు, జగన్, లక్ష్మి, అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : మొయినాబాద్ మండల కేంద్రంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య జెండాను ఎగురవేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎగురవేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, జంగయ్య, జహంగీర్, వెంకటయ్య, బుజ్జయ్య, సీఐటీయూ నాయకులు రత్నం, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
మంచాల : వివిధ గ్రామాల్లో మేడే వేడుకలను నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన కార్మిక సంఘం నాయకులు జెండాలను ఆవిష్కరించారు. మంచాల, జాపాల, ఆరుట్ల, బండలేమూరు, చెన్నారెడ్డి గూడ, రంగాపూర్ గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు.
కార్మికులకు సన్మానం
యాచారం: మండలంలోని నందివనపర్తి గ్రామంలో బీఎన్‌రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో మే డే సందర్భంగా కార్మికులను ఆదివారం ఘనంగా సన్మానించారు. బీఎన్‌రెడ్డి ట్రస్టు చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు బిలకంటి శేఖర్‌రెడ్డి గ్రామపంచాయతీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, మేస్త్రీలను సన్మానిం చి వారికి స్వీట్లు పంచి పెట్టాడు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జోగిరెడ్డి, కొండాపురం పాం డు, శంకర్, యాదయ్య, శేఖర్, రాములు, రవి, లక్ష్మణ్, బాలరాజు, లక్ష్మమ్మ, అరుణ, సంతోష తదితరులున్నారు.