టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గులాబీ జెండాను ఆవిష్కరించారు. జై తెంగాణ.. జై కేసీఆర్ అని నినదించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమాలను గుర్తు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. గ్రామ గ్రామాన జరిగిన జెండా ఆవిష్కరణల్లో గులాబీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేల నాయకత్వంలో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ప్లీనరీకి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. చేవెళ్లలోని జెండా ఆవిష్కరణలో ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు.
షాబాద్, ఏప్రిల్ 27: 14 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షాలకు భవిష్యత్ లేదని, టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకుపోతుందని తెలిపారు. నియోజకవర్గంలోని షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ జెండాలు ఎగురవేసి వేడుకలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు విజయలక్ష్మి, ప్రశాంతిరెడ్డి, నక్షత్రం, గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, గోపాల్, వాసుదేవ్‌కన్నా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రెపరెపలాడిన గులాబీ జెండాలు
ఇబ్రహీంపట్నం : టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వాడవాడనా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. టీఆర్ఎస్పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని ఆయా కూడళ్లల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు పెద్దఅంబర్‌పేట్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో గులాబీ జెండాలను ఎగురవేశారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని జెండాలను ఆవిష్కరించగా, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లతో పాటు వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, మంచాల ఎంపీపీ నర్మద, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్, కిషన్‌గౌడ్, మున్సిపాలిటీల అధ్యక్షులు అల్వాల వెంకట్‌రెడ్డి, కొప్పు జంగయ్య, అమరేందర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు ప్లీనరీకి తరలివెల్లారు.
ఆవిర్భావ వేడుకలు.. సత్కారం
ఆమనగల్లు : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో ఘనంగా జరుపుకొన్నారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో వేడుకల్లో భాగంగా పార్టీజెండాలను ఆవిష్కరించి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకులను సత్కరించారు. వేడుకల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, ఇతర ప్రజాప్రతినిదులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పల్లె పల్లెనా ఎగిరిన గులాబీ జెండా
షాద్‌నగర్ : తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను షాద్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో గులాబీ జెండాను ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు.షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, ఫరూఖ్‌నగర్ మండలం కొండన్నగూడ, హాజిపల్లి, విఠ్యాల, బూర్గుల, రాయికల్, లింగారెడ్డిగూడ, నాగులపల్లి, చింతగూడ, కంసాన్పల్లి, పులిచర్లకుంట తాండ, మధురాపూర్, వెల్జర్ల గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట, నందిగామ, కొత్తూరు మండలాల్లోని అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యుగేందర్, చెట్ల నర్సింహ, కానుగు అంతయ్య, రవియాదవ్, జిల్లెల వెంకట్‌రెడ్డి, రాజేశ్‌పటేల్, దామోదర్‌రెడ్డి, సయ్యద్సాధిక్, హఫీజ్, శ్రీధర్‌రెడ్డి, రాంచంద్రయ్య, గోపాల్, రాములు, రవీందర్, కోస్గి శ్రీనివాస్‌లు, చంద్రకళ, దేవేందర్‌యాదవ్, జనార్థ్ధన్, గోవింద్‌రెడ్డి, రవి నాయక్ పాల్గొన్నారు.
ప్లీనరీకి తరలిన నాయకులు
ఆమనగల్లు, ఏప్రిల్ 27 : ఆమనగల్లు బ్లాక్ మండలాల నుంచి బుధవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి కల్వకుర్తి నియోజకవర్గంలోని బ్లాక్ మండలాల నాయకులు వివిధ వాహనాల్లో తరలివెళ్లారు. తరలిన వారిలో ఆమనగల్లు ఎంపీపీ అనిత, కడ్తాల ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, పరమేశ్, జైపాల్‌రెడ్డి, శంకర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షు డు వీరయ్య, నిట్ట నారాయణ, దశరథ్‌నాయక్, జైపాల్‌నాయక్, లాలయ్యగౌడ్ తరలివెళ్లారు.