ఆమనగల్లు, ఏప్రిల్ 24 : నిరుపేదల వైద్యం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కోరారు. ఆదివారం మాడ్గుల,ఆమనగల్లు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. మాడ్గుల మండలానికి చెందిన యాదమ్మకు రూ.1.50 లక్షలు, కొలుకులపల్లి గ్రామానికి చెందిన గిరికి రూ.లక్ష, చంద్రయ్యకు రూ.48 వేలు, జంగయ్యకు రూ.27 వేలు, రామచంద్రయ్యకు రూ.24 వేలు, సువర్ణకు రూ.16 వేలు, సాయిరెడ్డికి రూ.16వేలు, కలకొండ గ్రామానికి చెందిన భారతమ్మకు రూ. 23వేలు, ఆమనగల్లు మండలంలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలానికి రూ. 20 వేలు, రాజమణికి రూ.23 వేలకు సంబంధించిన చెక్కులను పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా పేదల ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో పార్టీలకతీతంగా భాగస్వాములవ్వాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమన్నారు.