చేవెళ్లటౌన్, ఏప్రిల్ 20 : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 54 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వివరించారు. బంగారు తెలంగాణ సాధించాలంటే అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, తహసీల్దార్ అశోక్ కుమార్, ఆలూర్ ఎంపీటీసీ నరేందర్‌చారి, సర్పంచ్‌లు ప్రభాకర్, మోహన్‌రెడ్డి, నరహరి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, నాయకులు నాగార్జునరెడ్డి, రమణారెడ్డి, కృష్ణారెడ్డి లబ్ధిదారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 12 మందికి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మేలు జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, తహసీల్దార్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి
శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్‌పల్లిలో వైకుంఠధామం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మైనారిటీ కాలనీలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నూతన ట్రాక్టర్, ఆటోలకు పూజలు చేసి సిబ్బందికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడతానన్నారు. నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్‌కన్నా, కౌన్సిలర్లు పార్శి రాధ, శ్రీనాథ్‌గౌడ్, అశోక్, సంతోష్, మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్‌కుమార్, నాయకులు అశోక్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
చేవెళ్లటౌన్, ఏప్రిల్ 20 : ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని మతాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి కృష్ణా రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఆలూర్ ఎంపీటీసీ నరేందర్‌చారి, సర్పంచ్‌లు ప్రభాకర్, మోహన్ రెడ్డి, నరహరి రెడ్డి, నర్సింహులు, ప్రధాన కార్యదర్శి హన్మంత్ రెడ్డి, నాయకులు నాగార్జున రెడ్డి, రమణారెడ్డి, కృష్ణా రెడ్డి, ముస్లింలు పాల్గొన్నారు.