కోహెడ, జూలై 3 : మారుమూల పల్లె సైతం ప్రగతి బాటలో పయనించాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ధర్మసాగర్పల్లి, కోహెడలో 4వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కోహెడ కొత్త బస్టాండ్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. అనంతరం ధర్మసాగర్పల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. నర్సరీని, డంపింగ్‌యార్డును సందర్శించారు. కోహెడలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి ప్రశంసించారు. అనంతరం కురుమ వాడలో మొక్కలు నాటారు. శిథిలావస్థకు చేరిన ఇల్లును కూల్చివేయడం, నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ప్రకృతి వనం నర్సరీ, డంపింగ్‌యార్డు , వైకుంఠధామం నిర్మాణాలు పూర్తి చేయించారన్నారు. పల్లెలు శుభ్రంగా ఉండాలని ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ను అందించారన్నారు. శనిగరం ప్రాజెక్టు అభివృద్ధికి రూ. 23 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కాలువల మరమ్మతులు చేపట్టాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి విజ్ఞప్తి చేశారని, త్వరలోనే ఆ పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌కు ప్రజాప్రతినిధులు, ప్రజలు వినతులు అందజేశారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, ప్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ ఆవుల రాధమ్మ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పేర్యాల నవ్య, మాజీ ఎంపీపీ తిప్పారపు శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్, రైతు బంధు మండల కన్వీనర్ పేర్యాల రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు జాగిరి కుమారస్వామి, నాయకులు ఆవుల మహేందర్, తోట ఆంజనేయులు ఉప్పరపల్లి కృష్ణమూర్తి, అబ్దుల్ రహీం, పోలవేని కుమారస్వామి, జాలిగాం శంకర్, లోనె మల్లేశం, బత్తిని తిరుపతి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంపై మక్కువ
హుస్నాబాద్ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మక్కువ ఎక్కువని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి గతంలో నిధుల మంజూరుకి కృషి చేశారని, మళ్లీ రూ.55 కోట్ల నిధులు మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అనంతరం 31 మందికి రూ.7,88,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు.
-హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్