షాద్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 16: షాద్‌గనర్ మున్సిపాలిటీలోని శ్రీ గోదాసమేత శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం గోదాసమేత శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచి దేవాలయంలో రథాంగ హోమం, రథబలి అనంతరం రథోత్సవం, నిత్యారాధన, సేవాకాలం, హోమం, బలిహరణం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం తదితర పూజలు చేశారు. స్వామి రథోత్సవాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. చక్రస్నానం కార్యక్రమంలో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ బచ్చలి నర్సింహ, ప్రతాప్‌రెడ్డి, ఎంపీటీసీ భీష్వ రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యుడు ఒగ్గు కిషోర్, వివిధ పార్టీ నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, తిరుపతిరెడ్డి, సాయీశ్వర్రెడ్డి, బాల్‌రాజు, కుమార్, బాల్‌రాజు పాల్గొన్నారు.
వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ
సమాజంలోని ప్రతి మనిషి ధర్మమార్గంలో నడుచుకుని దేవునిపై భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని జాతీయ బీసీ కమీషన్ సభ్యులు తల్లోజు ఆచారి సూచించారు. మండల కేంద్రంలో వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ శనివార వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి హాజరయ్యారు. దేవాలయంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన శివలింగం, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమాంబ విగ్రహాలకు దర్శించుకుని దేవాలయ ఆవరణలో జరుగుతున్న హోమాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారిని విశ్వకర్మ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ యాదయ్యచారి, నాయకులు శ్రీవర్ధ్దన్రెడ్డి, అందె బాబయ్య, మాజీ ఎంపీపీ విశ్వనాథం, మాజీ సర్పంచ్ అమృతమ్మ, సంఘం నాయకులు వేణుగోపాలాచారి, ద్రోణాచారి, రాజుచారి, రామకృష్ణ, కేశవులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
సంఘీగూడ గ్రామంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, పీఏసీఎస్ చైర్మన్ మంజూలరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మేకగూడ సర్పంచ్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.