సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణా వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్య తను సంతరించుకుందని, దీనిని నగర ప్రయా ణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వేజోన్ ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులకు సంబంధించి గురువారం ఆయన ప్రత్యేక సమా చారాన్ని విడుదల చేశారు. ప్రతిరోజూ ప్రయా ణించే ఉద్యోగులు, దూర ప్రాంతాలకెళ్లే వారికి ఉపయోగపడేలా జంట నగరాల్లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) ఎంతో సౌకర్యవంతంగా, అనుకూలంగా ఉంటుందన్నా రు. కరోనా తర్వాత ఎంఎంటీఎస్ లోకల్ సర్వీ సులను ప్రస్తుతం 86 నడుపుతున్నట్లు జీఎం తెలిపారు. ప్రధానంగా నగరంలోని దక్షిణం, తూర్పు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ ప్రాంతంతో అనుసంధానం చేస్తూ ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్- హైదరా బాద్-లింగంపల్లి-తెల్లాపూర్-రామచంద్రాపు రం ప్రాంతాల మీదుగా 29 రైల్వేస్టేషన్లను కలుపుతూ లోకల్ సర్వీసులను నడుపుతున్నా మన్నా రు. మొత్తంగా నగరంలో 50 కిలో మీటర్ల మేర ప్రయాణికుల సౌకర్యార్థం సర్వీసులను నడుపుతున్నట్లు వివరించారు.
ఉదయం 4.30 గంటల నుంచే..
నగర ప్రయాణికుల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులు ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకే ప్రారంభమై తిరిగి అర్ధరాత్రి 0.30 గంటల వరకు కొనసాగుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వేజోన్ ఇన్చార్జి జీఎం తెలిపారు. ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసుల్లో తక్కువ ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎంఎంటీఎస్లలో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు. టికెట్ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు ఆటో మేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం, మొబైల్ యాప్ ద్వారా టికెట్లను పొందొచ్చన్నారు.