ఇబ్రహీంపట్నం, జూలై 1 : తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి ఆయన గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసువ్యవస్థ పటిష్టతకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలంగాణలో పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారని, వారు చేపడుతున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పటిష్టతకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. దీంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పాటు నేరస్తులను వెంటనే అరెస్టుచేసి వారికి శిక్షలు పడేలా పోలీసులు ఎంతగానో కృషిచేస్తున్నారని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణాలో ఎంతో నైపుణ్యతగల పోలీసు అధికారులున్నారన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సీసీకెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరాలు గణనీయంగా తగ్గిపోతున్నాయన్నారు. ఆయా గ్రామాల్లో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని, ఇది అభినందనీయమన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుస్టేషన్ నూతన భవనం నిర్మాణానికి ముందుకు వచ్చిన రామోజీ సంస్థలను ఆమె ప్రశంసించారు. రాచకొండ పోలీస్కమిషనర్రేట్ ఏర్పడిన ఐదేండ్లలో నేరాల అదుపునకు కృషిచేసిన ప్రతిఒక్క పోలీసు ఆఫీసర్లను ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామోజీ ఫిలింసిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్, రాష్ట్రనాయకులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, క్యామ మల్లేశ్, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, ఆర్డీవో వెంకటాచారి, రాచకొండ అడ్మిన్ డీసీపీ శిల్పవల్లి, యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్‌రెడ్డి, ట్రాఫిక్డీసీపీ శ్రీనివాస్, మల్కాజ్గిరి, సీసీఎస్ షలీమా, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ వాసం స్వామి, పోలీసులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నేర రహిత సమాజ నిర్మాణం కృషి చేయాలి
అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 1 : నేర రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 110 సీసీ కెమెరాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్‌భగవత్ మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు రాచకొండ పోలీస్‌కమిషనరేట్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేసేందుకు దోహదపడుతాయన్నారు. 110 సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 30లక్షల విరాళాలు అందించిన దాతలకు జ్ఞాపికను అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ జి సుధీర్‌బాబు, కె .శిల్పవల్లి, ఏపీపీ బుర్ర రేఖమహేందర్‌గౌడ్, జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్, బాటసింగారం సహకార బ్యాంక్ చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ స్వామి, ఎస్ఐలు జానకిరాంరెడ్డి, వీరభద్రం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.