ధారూరు, ఏప్రిల్ 10 : స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ, పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ చేపడుతున్నారన్నారు. గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ రమాదేవి, పీఏసీఎస్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, వారితోపాటు మోమిన్‌కలాన్, రాజాపూర్, మోమిన్‌ఖుర్దు గ్రామాలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని.. బంగారు తెలంగాణలో తాము కూడా భాగస్వామ్యమవుతామని వారు తెలిపారన్నారు. అభివృద్ధిని చూసి పార్టీలోకి చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ధారూరు మండల ప్రధాన కార్యదర్శి రాజుగుప్తా, మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్‌కుమార్, నాయకులు మాణిక్యం, రవికుమార్, రాములు, శ్రీపతిరెడ్డి, రవీందర్‌రెడ్డి, మునీర్, నాయకులున్నారు.