షాద్‌నగర్, ఏప్రిల్ 9 : తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామానికి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా బంగారు తెలంగాణ దిశగా పయనిస్తుందంటే టీఆర్ఎస్ సారథ్యంలోని ప్రభుత్వ పాలనే కారణమన్నారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ తలపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇతరులకు ఆదర్శంగా నిలిచాయన్నారు. పార్టీలో చేరిన నాయకులకు పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో దూసకల్, కొండన్నగూడ గ్రామ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
కొందుర్గు, ఏప్రిల్ 9 : కొందుర్గు గ్రామానికి చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులకు శనివారం రూ. 3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందజేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, గోపాల్, జగదీశ్వర్‌గౌడ్, శ్రీను, యాదగిరి, చందు, లింగం, జంగయ్య, రామస్వామి, రఘు పాల్గొన్నారు.
భక్తిభావం కలిగి ఉండాలి
కొందుర్గు : సమాజంలో ప్రతి ఒక్కరికి భక్తిభావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. జిల్లెడు చౌదరిగూడ మండలంలోని జిల్లెడు గ్రామ శివారులో ఆంజనే యస్వామి దేవాలయం ప్రారం భోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. ప్రజలు ఐక్యంగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బాబురావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్, శ్రీధర్‌రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, రాములు, జబ్బార్, నవీన్, నారాయణ, రాములు, మల్లేశ్, మోతిలాల్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.