ఇబ్రహీంపట్నం, మార్చి 31 : గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టినందున నిరుద్యోగులు పట్టుదలతో కష్టపడిచదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన అభ్యర్థులకు ఆయన హాల్‌టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉగాది నుంచి ప్రభుత్వ ఉద్యోగాల పండుగ ప్రారంభమవుతోందని కొత్త సంవత్సరం ఉద్యోగనామ సంవత్సరంగా వెలుగొందుతుందని ఆయన అన్నారు. సమయాన్ని వృథా చేసుకోవద్దని, సెల్ఫోన్ల, సరదాలను ఏడాదిపాటు దూరంగా ఉంచాలని సూచించారు.
రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాలు ఒకే ఏడాదిలో భర్తీ చేసే సాహసం ఎవరూచేసే అవకాశం లేదని, అది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడల్లా యువతకు తగు తోడ్పాటునందించటానికి ఎంకేఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. ఏప్రిల్ 3న ఉదయం 9 గంటలకు గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించే ప్రవేశ పరీక్ష సమయానికి అభ్యర్థులంతా చేరుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, ఫౌండేషన్ కార్యదర్శి జెర్కోని రాజు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు భరత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంకేఆర్ ఫౌండేషన్ సభ్యులు రాజ్‌కుమార్, విజయ్‌కుమార్, రాజేశ్‌గౌడ్, శివసాయి, సురేశ్, ప్రసాద్‌గౌడ్, మనీష్‌రెడ్డి, శ్రవణ్, జగదీశ్ పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మంచాల : మహిళల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం, స్టార్ మహిళా మండలి ద్వారా మూడు నెలలుగా కుట్టుమిషన్‌లో శిక్షణ పొందిన 75 మంది మహిళలకు గురువారం మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మహిళలకు శిక్షణ సర్టిఫికెట్తో పాటు ఉచిత కుట్టుమిషన్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు జాటోతు నర్మద, కృపేశ్, జడ్పీటీసీ నిత్య, సహకార సంఘం చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి, సర్పంచ్ జగన్‌రెడ్డి, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంస్థ ప్రత్యేకాధికారి ఆనంద్‌కుమార్, రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎన్జీవో చైర్మన్ ఫాతిమా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.