ఇబ్రహీంపట్నం, మార్చి 22: కొవిడ్ మహమ్మారి తర్వాత గాడినపడిన ఆర్టీసీ ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన అన్ని రహదారుల్లో సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఆయా రూట్లలో బస్సులను నడుపుతున్నారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలో ఇబ్రహీంపట్నం, మిధానీ, ఉప్పల్, బండ్లగూడ, హయత్‌నగర్-1, హయత్‌నగర్-2 డిపోలున్నాయి. ఈ డిపోల పరిధిలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను యథావిధిగా నడుపుతున్నారు. దీంతో గతంలో మాదిరిగా ఇబ్రహీంపట్నం డిపో ఆర్టీసీ ఆదాయం ప్రతిరోజూ రూ.పది లక్ష ల వరకు వస్తున్నది. అలాగే, మిగిలిన డిపోలు కూడా గతంలో వచ్చిన ఆదాయా న్ని క్రమంగా చేరుకుంటున్నాయి. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ వినూ త్న కార్యక్రమాలకు చేపడుతున్నది. ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో సేవలు ప్రజలకు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఇందులో కూరగాయలు, ఇతరత్రా రవాణాకు సం బంధించిన సరుకులను చేరవేస్తుండటం తో ఎంతోమంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అలాగే బస్సుల్లో గూ గుల్పే, ఫోన్‌పే వంటి ఆన్లైన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా బస్స్టేషన్ల వద్ద సూపర్వైజర్లను ఏర్పాటు చేసి ప్రజలు ప్రైవేట్ వాహనాల కు బదులు ఆర్టీసీలోనే ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతిరోజూ రూ.పది లక్షల ఆదాయం
కొవిడ్‌తో అస్తవ్యస్తంగా మారిన ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మళ్లీ గాడినపడింది. ప్రస్తుతం ఈ డిపోలో ప్రతిరోజూ 130 బస్సులు, ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రతి 15 నిమిషాలకు ఒక్క బస్సును నడుపుతున్నారు. ప్రతిరోజూ డిపో పరిధిలోని 60 రహదారుల్లో 40 వేల కిలోమీటర్ల వరకు బస్సులు నడుస్తున్నాయి. దీంతో నిత్యం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోకు రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. దీంతోపాటు కార్గో బస్సులను కూడా ప్రయాణికులు ఆదరిస్తున్నారు.
రాత్రి వేళల్లోనూ బస్సులు..
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో నుంచి రాత్రివేళల్లోనూ బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 4గంటల వరకు ఇబ్రహీంపట్నం నుంచి జేబీఎస్‌కు రెండు బస్సులు, ఇబ్రహీంపట్నం నుంచి ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌కు రెండు బస్సులను ప్ర యాణికుల సౌకర్యార్థం నడుపనున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులను కూడా నడుపుతామని తెలిపారు. గతంలో ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నానికి రాత్రిపూట బస్సు సర్వీసులు కొనసాగ లేదు.
సమస్యలను పరిష్కరిస్తున్నా..
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి మంగళవారం సాయం త్రం 5నుంచి 6గంటల వరకు డయల్‌యువర్ డీఎం కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నాం. డిపో పరిధిలోని వివి ధ గ్రామాల ప్రజల నుంచి వచ్చిన సమస్యలను.. తన పరిధిలో ఉంటే అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నా. పరిధిలో లేని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నా. దీంతో ప్రయాణికులకు సంస్థపై మరింత నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నా. ఆదాయ వనరుల పెంపే లక్ష్యంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
-బాబూనాయక్, ఇబ్రహీంపట్నం డీఎం