ఇబ్రహీంపట్నం, నవంబర్ 30 : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి పలువురికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను బుధవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరుకు చెందిన మేకం నర్సింహకు రూ.లక్ష, అక్కి యశోదకు రూ.లక్ష చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా మారిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ 25వ వార్డుకు చెందిన శరణయ్య కుటుంబసభ్యులకు రూ.2లక్షల ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగులేక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి కొండంత భరోసానిస్తున్నదన్నారు. ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాజేశ్వర్, నాయకులు నందకిశోర్, రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
నందిగామ, నవంబర్ 30 : సీఎం సహాయనిధి పథకం పేదల ఆరోగ్యానికి భరోసానిస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. చేగూరు గ్రామానికి చెందిన శివకుమార్‌కు రూ.59,000ల ఎల్వోసీ లెటర్‌ను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బుధవారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజునాయక్, నాయకులు శేఖర్‌చారి, శేఖర్ పాల్గొన్నారు.