విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి అన్నారు.
- తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి
- గున్గల్ ఆదర్శ పాఠశాల సందర్శన
యాచారం, నవంబర్ 24 : విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి అన్నారు. మండలంలోని గున్గల్ గ్రామంలో ఉన్న ఆదర్శ పాఠశాలను గురువారం ఆమె సందర్శించారు. పాఠశాల తరగతి గదులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. మధ్యాహ్న భోజనంలో అవకతవకలు ఉండొద్దన్నారు. వసతిగృహంలో ఉంటున్న బాలికలకు అన్ని రకాల వసతులను కల్పించాలన్నారు. ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎమిమా పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

