కడ్తాల్, మార్చి 19 : కరోనా మహమ్మారిని పూర్తి స్థాయి లో కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 12-14 సంవత్సరాల్లోపు పిల్లలకు కొవిడ్ టీకాను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నారులకు టీకా వేయించడంలో ఎలాంటి అపోహలు వద్దన్నారు.ఆశ వర్కర్లు చేస్తున్న సేవలను ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు భిక్షపతి, గణేశ్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ లాయక్‌అలీ, కోఆప్షన్ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు నర్సింహ, నాయకులు జహంగీర్‌అలీ, రాంచంద్రయ్య, వెంకటయ్య, హెచ్ఎం జంగయ్య, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
పిల్లలకు టీకా వేయించాలి
12 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ వ్యాక్సిన్‌ను తప్పని సరిగా వేయించాలని ఎంపీడీవో మమతాబాయి అన్నారు. మండలంలోని బండరావిరాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎంపీవో వినోద, సర్పంచ్ కవాడి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ దంతూరి అనితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడానికి చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌ను తప్పని సరిగా వేయించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నెమురగోముల స్వామి, వార్డు సభ్యులు, ఏఎన్ఎం మంజుల, ఆశ వర్కర్లు ఆండాలు, బాలమణి, హెచ్ఎం మనోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ తప్పనిసరి
కరోనాను నివారించేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఇబ్రహీంపట్నం వైద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల పరిధిలోని రాయపోల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ వేయించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.