ధారూరు, నవంబర్ 6 : కార్తిక మాసం తొలి ఆదివారం, సెలవు దినం కలిసి రావడంతో మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తమ మిత్రులు, బంధువులు, కుటుంబసభ్యులతో భారీగా తరలివచ్చారు. పర్యాటకులు ప్రాజెక్టు నీటిలో సెల్ఫీలు, ఫొటోలు, బోటింగ్ చేసేందుకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. అధిక సంఖ్యలో రావడంతో ప్రాజెక్టు కళకళలాడింది. బోటింగ్ సిబ్బంది సలహాలు, సూచనల మధ్య బోటింగ్ చేశారు. పిల్లలతో సరదాగా గడిపారు. ప్రాజెక్టు ఆవరణలో తినుబండారాలు, చెరకు రసం, ఫాస్ట్ఫుడ్ తదితర దుకాణాలు ఏర్పాటు చేశారు. వనభోజనాలు చేశారు.