శంకర్పల్లి, నవంబర్5 : నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1,9,10 వార్డుల్లో రూ. 1.10 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీలకు మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నదని తెలిపారు. మున్సిపాలిటీకి మరిన్ని నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్, మండల అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, కౌన్సిలర్లు లావణ్య, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
దైవ చింతన కలిగి ఉండాలి
శంకర్పల్లి : ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) మున్సిపాలిటీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించి అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్‌కుమార్, స్వాములు తదితరులు పాల్గొన్నారు.