కులకచర్ల, అక్టోబర్ 20 : తెలంగాణ సర్కార్ పోడుభూముల రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సభలను నిర్వహిస్తున్నది. అటవీభూము లు సాగుచేసుకునే రైతులు ఆ భూములపై హక్కులు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. చాలా కాలంగా అటవీభూములు సాగు చేసుకుంటున్న రైతులు తమకు ఈ భూములు ఎప్పుడు సొంతమవుతాయోనని ఎదురు చూస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ అర్హులను ఎంపిక చేసి వారికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలో ఉన్న పోడుభూములకు సంబంధించి 2286మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. కులకచర్లలో 1227 మంది రైతులు, చౌడాపూర్‌లో 1059 మంది రైతులు ఉన్నారు. దరఖాస్తులు చేసుకున్న రైతుల వివరాలను తీసుకొని ఆయా గ్రామాల్లో రైతుల దగ్గరకు వెళ్లి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్, పీరంపల్లి, అనంతసాగర్, కుస్మ సముద్రం, గోరిగడ్డతండా గ్రామాలో అటవీ భూములు న్నాయి. చౌడాపూర్ మండల పరిధిలోని మందిపల్, మక్తవెంకటాపూర్ గ్రామాల్లో రైతులు అటవీభూములను సాగు చేస్తున్నారు.
ప్రభుత్వం పోడు రైతులకు న్యా యం చేస్తుంది. చాలా కాలం నుం చి రైతులు అటవీభూములు సాగు చేసుకుంటూ తమ భూమి లా వ్యవహరిస్తున్నా ఇప్పటికీ అటువంటి భూములపై ఎలాంటి హక్కులు కల్పించక పోవడం వలన ప్రభుత్వం పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.
-రాంలాల్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు
కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని పోడు భూములు ఉన్న రైతులకు ఎంతగానో మేలు జరుగనుంది. మక్తవెంకటాపూర్ గ్రా మంలో చాలా మంది పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులు ఉన్నారు. దీని వలన వారికి లాభం చేకూరుతుంది. సీఎం కేసీఆర్ రైతుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉంది.
-రాందాస్‌నాయక్, జడ్పీటీసీ
పోడు భూములు సాగు చేస్తున్న రైతు లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలిం చి వాటికి సంబంధించిన వివరాలను జిల్లాకు నివేదిస్తాం దరఖాస్తులు చేసుకున్న రైతుల, వారి భూముల వివరాలను గ్రామ సభలో విచారిస్తాం. ప్రభుత్వం ఆదేశాను సారం దరఖాస్తులు చేసుకున్న రైతుల దరఖాస్తులు పరిశీలిస్తున్నాం.
– అశోక్‌కుమార్, తహసీల్దార్, చౌడాపూర్