కులకచర్ల, అక్టోబర్ 17: కులకచర్లలో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీఎస్ భవననిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనో హర్రెడ్డి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీఎస్ భవననిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలా పీఏసీఎస్ నూతన భవనాన్ని నిర్మిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, డైరెక్టర్ కొండయ్య, నా యకులు దామోదర్‌రెడ్డి, అంజిలయ్య, బాల్‌రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా కులకచర్ల పీఏసీఎస్ కార్యాలయంలో సోమవారం డీసీసీబీ చైర్మన్ బంగారం తూకం మిషన్‌ను ప్రారంభించారు. బంగారు రుణాలు పీఏసీఎస్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు వ్యవసాయ రుణాలతో పాటు బంగారు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఈవో బక్కారెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.