తాండూరు, అక్టోబర్ 16: ఆడపిల్ల చదువు అవనికే వెలుగు… మెరుగైన సమాజానికి పునాది. పేదరికంతో బాలికలు చదువుకు దూరం కాకూడదు..జీవితాన్ని అంధకారం చేసుకోకూడదనే సంకల్పంతో అనాథలు, డ్రాపౌట్స్, ఆర్థికంగా వెనుకబడిన బాలికలకోసం ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేలా,చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా కేజీబీవీలు ఎంతో కృషి చేస్తున్నాయి. విద్యార్థినుల భవిష్యత్తుకు బంగా రు బాటలు వేస్తున్నాయి.
18 కేజీబీవీల్లో 5,260 మంది..
వికారాబాద్ జిల్లాలో 18 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలుండగా.. అందులో 5,260 మంది విద్యార్థినులు మెరుగైన వసతుల్లో గుణాత్మత విద్యను అభ్యసిస్తున్నారు. ఏడు పాఠశాలల్లో ఆరునుంచి 12వ తరగతి వరకు, 11 పాఠశాలల్లో ఆరు నుంచి పదోతరగతి వరకు పాఠశాలలను ప్రభుత్వం కొనసాగిస్తున్నది.
నిత్యావసర వస్తువులు, పౌష్టికాహారం
ప్రభుత్వం ఒక్కో విద్యార్థినిపై ప్రతిరోజూ రూ.34.5 ఖర్చు పెడుతున్నది. ప్రతి మూడు నెలలకొకసారి కేసీఆర్ కిట్ పేరుతో విద్యార్థినులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్ప ట్లు, ప్లేట్లు, గ్లాసులు తదితర వసతులను కల్పిస్తున్నది. నిత్యం బాలికలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఉదయం పూట టిఫిన్, బూస్ట్, ఇడ్లీ, చపాతి, పులిహోర, కిచిడీ వంటి పదార్థాలను అందిస్తున్నారు. మధ్యాహ్నం సన్నబియ్యంతో కూడిన భోజనం, పప్పు, కూరగాయ లు, మజ్జిగ, సాయంత్రం స్నాక్స్ లో ఉడకబెట్టిన పెసర్లు తదితర వాటిని ఇవ్వడంతోపాటు రాత్రి పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు.
ఆటాపాటలతో బోధన..
చదువు మధ్యలోనే మానేసి వికారాబాద్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చేరిన విద్యార్థినులకు చదువుపై ఆసక్తిని పెంచేందుకు మొదట ఆటాపాటలతో పాఠాలను బోధిస్తున్నా రు. మొదటి నాలుగు నెలల వరకు వినడం, మా ట్లాడటం, చదవడం, రాయడంపై ఉపాధ్యాయు లు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ఆ తర్వాతే పాఠ్య పుస్తకాల్లోకెళ్లి బోధిస్తున్నారు. దీనిద్వారా బాలికలకు చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ప్రత్యేక తరగతులు, టెస్టులు నిర్వహిం చి వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా టీచర్లు చదువులో వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వారి కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకూ సంబంధించిన ఉపాధ్యాయులు విద్యార్థినుల నోటు పుస్తకాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నారు. ప్రశ్నలు, జవాబులతోపాటు అక్షర దోషాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిరాశ, నిస్పృహల నుంచి వారిని ఆత్మవిశ్వాసం వైపు తీసుకెళ్లేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజూ క్రీడలు, వ్యాయామం..
కేజీబీవీల్లో ప్రతిరోజూ విద్యార్థినులకు క్రీడలు, వ్యాయామం, యోగా, ధ్యానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, ఖోఖో వంటి క్రీడల్లో తర్ఫీదును ఇస్తున్నారు. ప్రతిభ ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో వారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకెళ్లి విజయం సాధిస్తున్నారు. అదేవిధంగా సాంస్కృతిక అంశాలతోపాటు పెయింటింగ్, డ్రాయింగ్, కుట్లు, అల్లికలు తదితర వాటిలో శిక్షణ ఇస్తూ విద్యార్థినుల్లో నైపుణ్యాన్ని పెంచుతున్నారు.
పాఠశాల చాలా బాగుంది
వికారాబాద్‌లోని కస్తూర్బాగాంధీ పాఠశాల చాలా బాగుంది. వచ్చిన కొత్తలో కొంత ఇబ్బందిగా అనిపించింది. తర్వాత నేను అందరితో కలిసిపోయా. టీచర్లు మమ్మల్ని చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తున్నారు. బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత పదవిలో స్థిరపడాలని అనుకుంటున్నా. ప్రభుత్వం పేదలకు అన్ని రకా ల వసతులను కల్పించి, మెరుగైన బోధన ను అందించడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-పావని, కోట్‌పల్లి విద్యార్థిని