పరిగి, సెప్టెంబర్ 28 : మత్స్య సంపద పెరిగేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపడుతుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వం అందజేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టులో వదిలారు. అనంతరం నూతనంగా మంజూరైన ఆసరాకార్డులతో పాటు మహిళలకు బతుకమ్మ చీరలు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థిక భారం లేకుండా చేప పిల్లల పంపిణీతోపాటు పెంపకం చేపట్టడానికి సర్కారు చేయూత ఇస్తుందన్నారు. మత్స్యకారులకు వివిధ రకాల పరికరాలు కూడా అందజేసిందన్నారు. కులవృత్తులకు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించే విధంగా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తుందని చెప్పారు.
అనంతరం పరిగిలో ఆశా వర్కర్లకు యూనిఫాం ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్ పాల్గొన్నారు.