పరిగి, సెప్టెంబర్ 23: వానకాలంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యం కొనుగోలుకు అధి కా రులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం వాన కాలం కంటే ఈ సారి అధికంగా వరి సాగు విస్తీర్ణం ఉండడంతో అందుకు అనుగుణంగా ధాన్యం సేకర ణకు సంబంధించి అధికారులు ఇప్పటినుంచే ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నారు. వికా రాబాద్ జిల్లా పరిధిలో 1,31,200 ఎకరాలలో వరి పంట సాగు చేశారు. ఎకరానికి 2.762 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన జిల్లాలో వానకాలంలో 3,62,355 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని, దానిలో స్థానిక అవసరాలకు 54353 మెట్రిక్ టన్నులు పోను 3,08,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలు ఏర్పాటు చేయను న్నారు. జిల్లాలో 121కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇందులో డీసీఎంఎస్, మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌లు, ఐకేపీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు అవసరమైన ప్రతిచోట ఏర్పాటు చేయను న్నారు. ఇందుకుగాను గ్రామ స్థాయిలో గత వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనేది గుర్తించి సంబంధిత గ్రామాల్లో ఈసారి సైతం ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు. తద్వారా రైతులు ఇతర గ్రామాలకు వెళ్లకుండా తమ గ్రామంలోనే వరి ధాన్యం విక్రయించేలా ఏర్పాట్లు చేపడు తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఇటీవల ధాన్యం కొనుగోలుకు సంబం ధించిన సమావేశం జరిగింది. ఈసారి ధాన్యం కొనుగోలు అంశంపై పూర్తిస్థాయిలో చర్చిం చారు. ఏ శాఖ ద్వారా ఏ చర్యలు తీసుకోవాలన్నది జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
వరి ధాన్యం కొనుగోలుకు 70లక్షల బస్తాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో 20లక్షలు ఖాళీ బస్తాలు అందుబాటులో ఉండగా మిగతా 50లక్షల ఖాళీ బస్తా లు తెప్పించేందుకు ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యే నాటికి ఖాళీ బస్తాలు అందుబాటులో ఉంచడానికి అధికారులు కృషి చేస్తున్నారు. నవంబర్ మూడో వారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించనున్నారు. గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2060, కామన్ రకానికి రూ.2040 చొప్పున చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రతి గ్రామంలో రైతులకు అందజేసే టోకెన్ల ఆధారంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు వర్షం కురిస్తే ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లు సైతం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ వద్ద 1600 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా మరో 800 టార్పాలిన్లు తెప్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు జిల్లా మార్కెటింగ్ అధికారి లేఖ రాయనున్నారు. తద్వారా కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్‌కు అందజేసేందుకు సైతం అధికారులు చర్యలు చేపట్టారు. తద్వారా కొనుగోలు కేంద్రాలలో ఎక్కువ స్టాకు ఉండకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు ధాన్యం చేరవేయనున్నారు. అలాగే రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నాలుగు రోజుల్లోపే రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో ఈ వానకాలం సాగు చేసిన వరి పంటకు సం బంధించి సుమారు 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేక రణ చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నాం. నవంబర్ మూడో వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రా రంభమయ్యేలా చర్యలు చేపట్టాం. 70లక్షల ఖాళీ బస్తాలు అవసరమవగా 20లక్షల బస్తాలు సిద్ధంగా ఉన్నాయి.
– విమల, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్