బొంరాస్పేట, ఆగస్టు 19: స్వా తంత్య్ర వజ్రోత్సవాల సందర్భం గా శుక్రవారం బొంరాస్పేట ఉన్న త పాఠశాల ఆవరణలో మం డలస్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. మండలంలోని బొం రాస్పేట, దుద్యాల, చౌదర్పల్లి, రేగడిమైలారం ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థినీ, విద్యార్థులను జూనియర్, సీనియర్ విభాగాలుగా విభజించి కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో అంశాలలో పోటీలు నిర్వహించారు.
విద్యార్థులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీల ముగింపు సందర్భంగా గెలుపొందిన జట్లకు ఎంఈవో రాంరెడ్డి, ఉన్నత పాఠశాల హెచ్ఎం పాపిరెడ్డి బహుమతులను అందజేశారు. మండల స్థాయిలో గెలుపొందిన జట్లు ఈ నెల 22వ తేదీన జిల్లా కేంద్రాలలో నిర్వహించే జిల్లాస్థా యి పోటీలలో పాల్గొంటారని హెచ్ఎం పాపిరెడ్డి తెలిపారు.
దోమ,ఆగస్టు19: దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడలను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో కలిసి ఎంపీపీ అనసూయ ప్రారంభించారు.మండల పరిధిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, తదితర క్రీడల్లో పాల్గొన్నారు.
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు లీగ్ స్థాయిల్లో కొన్ని పాఠశాలలకు చెందిన వారు విజయం సాధించగా మరికొన్ని మ్యాచ్లు శనివారం జరుగనున్నాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ జ్యోతి, ప్రధానోపాధ్యాయుడు పురందాస్,ఉపాధ్యాయ బృందం,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.