సిద్దిపేట అర్బన్, జూలై 2 : ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఏసీపీ దేవారెడ్డి సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్, కాలేజీలో విద్యార్థినులకు మహిళల రక్షణ చట్టాల గురించి ర్యాంగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో, షీటీమ్, యాంటీ హ్యూమన్ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటే భవిష్యత్ మంచిగా ఉంటుందన్నారు.
చాలా మంది మహిళలు కష్టపడి చదివి ఎన్నో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. షీటీమ్ కైంప్లెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు జిల్లాలోని పలు ప్రదేశాల్లో అతికించబడి ఉంటాయని, ఎవరైనా బాధిత మహిళలు ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే http://qr.tspolice. gov.in లింక్ వస్తుందన్నారు.
ఇందులో ఫిర్యాదు ఫోరం ఓపెన్ అవుతుందని, వివరాలు సబ్మిట్ చేస్తే పోలీ స్ కార్యాలయానికి మీ కైంప్లెంట్ వెళ్తుందన్నారు. అప్పుడు సంబంధిత అధికారులు లొకేషన్‌కు చేరుకొని చర్యలు తీసుకుంటారని తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100 లేదా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 7901640473కు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదా, ప్రిన్సిపాల్ లక్ష్మాంజలి, సిబ్బంది పాల్గొన్నారు.