మెదక్ మున్సిపాలిటీ/ కొల్చారం/ చిలిపిచెడ్/ తూప్రాన్/మనోహరాబాద్/ చేగుంట/ రామాయంపేట/ నిజాంపేట, జూలై 2 : సహకార దినోత్సవం సందర్భంగా మెదక్‌లోని ప్రాథమిక సహకార కార్యాలయంలో శనివారం సహకార జెండాను చైర్మన్ హన్మంత్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు రాములు, నారాయణరెడ్డి, విజయ్, గట్టయ్య, సిద్ధ్దిరాంరెడ్డి, పెద్దరాంరెడ్డి, సిబ్బంది సాయికిరణ్ ఉన్నారు.
రైతులకు అండగా ఉండడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు విశేష కృషి చేస్తున్నాయని డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగె రమేశ్ అన్నారు. రంగంపేట సొసైటీలో సహకార జెండాను ఆవిష్కరించారు. కొల్చారం, వరిగుంతం, చిన్నాఘన్‌పూర్, అంసాన్పల్లి, కొంగోడు, కిష్టాపూర్, రాంపూర్ సొసైటీలో జరిగిన కార్యక్రమాల్లో చైర్మన్లతోపాటు సీఈవోలు నవీన్, కృష్ణ, బీరప్ప, సాయిరెడ్డి, రవిత, రాములు పాల్గొన్నారు.
– డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు అరిగె రమేశ్
చిలిపిచెడ్ మండలం సోమక్కపేటలో ప్రాథమిక సహకార సంఘంలో పీఏసీఎస్ సీఈవో పోచయ్య, డైరెక్టర్లు జెండాను ఆవిష్కరించారు. పీఏసీఎస్‌లు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, సుభాష్, రాంరెడ్డి, సిబ్బంది నర్సింహులు, రాజు, దత్తు పాల్గొన్నారు.
తూప్రాన్, మనోహరాబాద్ ఉమ్మడి మండలాల పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ భగవాన్‌రెడ్డి ఉన్నారు.
సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని డీసీఎంఎస్ జిల్లా డైరెక్టర్ సండ్రుగు స్వామి పేర్కొన్కారు. చేగుంట, రెడ్డిపల్లి, ఇబ్రహీంపూర్, నార్సింగిలో సహకార జెండా ను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో చైర్మన్లు మ్యాకల పరమేశ్, వంటరి కొండల్‌రెడ్డి, శంకర్‌గౌడ్, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు.
– డీసీఎంఎస్ జిల్లా డైరెక్టర్ సండ్రుగు స్వామి
రామాయంపేటలోని ప్రాథమిక సహకార సంఘం వారోత్సవాల సందర్భంగా పీఏసీఏస్ చైర్మన్ బాదె చంద్రం జెండాను ఆవిష్కరించారు. సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. సంఘంలో రుణాలు తీసుకున్న సభ్యులు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం రాయితీని ఇస్తున్నదన్నారు. పంట రు ణాలు తీసుకోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో సీఈవో నర్సింహులు, సిబ్బంది, డైరెక్టర్లు సుధాకర్‌రెడ్డి ఐలయ్య, నర్సింహులు,వెంకటస్వామిగౌడ్, లద్ద నర్సింహులు, శ్రీనివాస్ కొండల్రెడి తదితరులు ఉన్నారు.నిజాంపేట మండలం కల్వకుంటలో జెండాను పీఏసీఎస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, వైస్ చైర్మన్ రాజేశం ఆవిష్కరించారు.