ఇబ్రహీంపట్నం, ఆగష్టు 20 : మునుగోడు బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం గుండా ఎల్బీనగర్ నుంచి వెళ్తుండడంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల ప్రజలు భారీగా తరలివచ్చారు. విజయవాడ జాతీయ రహదారిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కాలె యాదయ్య, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి, డీసీసీబీ వైస్‌చైర్మన్ సత్తయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మంచాల ఎంపీపీ నర్మద, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, పెద్దఅంబర్‌పేట మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆకుల యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గ రాములు, కిషన్, రమేశ్‌గౌడ్, చీరాల రమేశ్, యువజన విభాగం టీఆర్ఎస్ అధ్యక్షుడు జెర్కోని రాజు, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
షాబాద్, ఆగస్టు 20 : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు.
యాచారం, ఆగస్టు 20 : మునుగోడు ప్రజాదీవెన బహిరంగ సభకు మండలం నుంచి భారీగా బయలుదేరారు. మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, టీఆర్ఎస్ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, కల్లూరి శివ, ఖాజు, మండలి గోపాల్, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, గోవర్ధన్‌రెడ్డి, కొండాపురం శ్రీశైలం, కృష్ణ తదితరులు తరలివెళ్లారు.
పెద్దఅంబర్‌పేట, ఆగస్టు 20 : ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆదేశానుసారం పెద్దఅంబర్‌పేటలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. సీఎం కాన్వాయ్ వెంట మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి, కౌన్సిలర్లు రమావత్ పరశురాం నాయక్, నాయకులు పాశం దామోదర్, బ్రహ్మానందరెడ్డి, సత్యనారాయణరెడ్డి, చిరంజీవి, దేవిడి విజయభాస్కర్‌రెడ్డి, రావుల గోపాల్‌గౌడ్ తదితరులు తరలివెళ్లారు. మరోవైపు మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్దెంకి కృష్ణారెడ్డి, నాయకులు చెరుకూరి జగన్, నాగార్జున తదితరులు స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్నారు.
ఆదిబట్ల, ఆగస్టు 20 : మునుగోడులో ప్రజాదీవెన సభకు ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఆదిబట్ల, కొంగరకలాన్, మంగల్‌పల్లి, బొంగ్లూర్, ఎంపీపటేల్‌గూడ గ్రామాల నుంచి అధిక సంఖ్య వెళ్లారు.
వికారాబాద్, ఆగస్టు 20 : ప్రజా దీవెన సభకు వెళ్లేందుకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ర్యాలీని ప్రారంభించగా, మర్పల్లి, ధారూరు, వికారాబాద్, బంట్వారం, కోట్‌పల్లి, మోమిన్‌పేట మండలాల నుంచి భారీ ఎత్తున జనం వెళ్లారు.
కేశంపేట ఆగస్టు 20 : కేశంపేట మండలం నుంచి జడ్పీటీసీ విశాలశ్రావణ్‌రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, పార్టీ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు శ్రావణ్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్‌గౌడ్, రమేశ్‌యాదవ్, మురళీమోహన్‌లతో పాటు పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు సభకు తరలివెళ్లారు.
తాండూరు రూరల్, ఆగస్టు 20 : తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు సభకు భారీగా బయలుదేరారు. నియోజకర్గ టీఆర్ఎస్ మహిళా కన్వీనర్ శకుంతల దేశ్‌పాండేతోపాటు పార్టీ సీనియర్ నాయకులు ఉమాశంకర్, గౌతాపూర్ ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రాములు, పార్టీ శ్రేణులు సభకు వెళ్లారు.
కడ్తాల్, ఆగస్టు 20 : ప్రజా దీవెన సభకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లారు.
ఆమనగల్లు, ఆగస్టు 20 : సభకు తరలిన వారిలో మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, వైస్‌ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్‌రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ ఉన్నారు.
షాద్‌నగర్ రూరల్, అగస్టు 20 : ఫరూఖ్‌నగర్ మండలం నుంచి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పిలుపు మేరకు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మునుగోడు సభకు తరలివెళ్లారు.
పరిగి, ఆగస్టు 20 : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి నేతృత్వంలో పరిగి, కులకచర్ల మార్కెట్ చైర్మన్లు ఎ.సురేందర్, హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కులకచర్ల జడ్పీటీసీ రాందాస్‌నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్ సభకు తరలివెళ్లారు.