కడ్తాల్, ఆగస్టు 20 : మండల కేంద్రంలో శనివారం కాటమయ్య స్వామి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. సాయం త్రం గ్రామంలోని ప్రధాన వీధులగుండా మహిళలు బోనాలను ఊరేగించారు. పోతరాజులు, శివసత్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయంలో స్వామి వారికి మహిళలు బోనాల్లో తీసుకొచ్చిన నైవేద్యాన్ని సమర్పించారు.