వికారాబాద్/తుర్కయాంజాల్, జనవరి 20 : 18 ఏండ్లు నిండిన యువతీయువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఓటు నమోదు స్పెషల్ డ్రైవ్‌ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వ్యక్తులు మరోచోట ఓటును నమోదు చేసుకోవద్దని సూచించారు. మరణించినవారి డెత్ సర్టిఫికెట్‌ను పరిశీలించి లేదా స్థానికంగా విచారణ చేపట్టి ఓటును తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, తహసీల్దార్ రవీందర్ దత్తు, డీఈఈ సత్యనారాయణ, ఆర్ఐ భిక్షపతి పాల్గొన్నారు.