ఆమనగల్లు,జూన్ 28: దివంగత ప్రధాని పీవీ నరసింహారావు చిరస్మరణీ యుడు అని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కొనియాడారు. సోమవారం పట్టణం లోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో పీవీ శతజయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ అడుగుజాడలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కార్య క్రమంలో అనంతరెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం, టీఆర్ఎస్ నా యకుడు తోటగిరి, మండలాధ్యక్షుడు నిట్టనారాయణ, బాలస్వామి, అప్పం శ్రీను, రమేశ్‌నాయక్, వెంకట్‌రెడ్డి, చందునాయక్, వెంకటేశ్ పాల్గొన్నారు.
వికారాబాద్, జూన్ 28 : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవలు చిరస్మరణీయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఇంటి వద్ద పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ పీవీ బహుభాషా కోవిదుడు అని, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్ కుమార్, కౌన్సిలర్ కృష్ణ, పట్టణ కోశాధికారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.