షాబాద్, జూన్ 28: వర్షపు నీటి సంరక్షణకు కా ర్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జలశక్తి అభియాన్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లా డుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం, వర్షపునీటి ప్రాముఖ్యతను చాటి చెప్పే అంశాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని, ఇందుకు గాను గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భూమి మీద పడిన ప్రతి వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు ప్రణాళికలు రూపొం దించాలని, ఈ పనులకు అన్ని శాఖల ద్వారా ఉపాధిహామీ నిధులు వినియోగించుకునేలా చూడాల న్నారు. వర్షపునీటి సంరక్షణ, గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, కుంటలు, చెక్‌డ్యామ్ లు, పాడుబడిన బావుల పూడికతీత, ఎండిపోయిన బోర్ల పునరుద్ధరణ, చెరువు శిఖం భూ ముల ఆక్రమణ లను తొలగించుట వంటి కార్యక్రమాలను ఈ పథకం కింద చేపట్టవచ్చునన్నా రు. ఇందుకు గాను ఆయా శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, ఉద్యానశాఖ అధికారి సునంద, గ్రౌండ్ వాటర్ డీడీ, ఇరిగేషన్ శాఖ అధికారి బన్సీలాల్ పాల్గొన్నారు.