కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్ద తల్లిదండ్రులకు ఊరట
షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5078 మంది లబ్ధిదారులకు రూ. 50 కోట్ల 83 లక్షల 89 వేల చెక్కు లు అందజేత
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
షాద్నగర్టౌన్ ఆగస్టు 22: గతంలో పేదల ఇండ్లల్లో ఆడబిడ్డ పుట్టిందంటే గుండె మీద కుంపటిగా, భారంగా భావించేవారు. ఆడబిడ్డ పెండ్లి చేయా లంటే ఉన్నది కాస్త అమ్ముకునే పరిస్థితి ఉండేది. తెలంగాణ సర్కార్ ఏర్ప డ్డాక ఆడబిడ్డల ఇండ్లల్లో కల్యాణకాంతులు నింపేలా సీఎం కేసీఆర్ 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి ఈ పథకంతో ఎంతో మంది నిరుపేద ఆడబిడ్డల పెండ్లిళ్లు సం తోషంగా జరుగుతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం తెలంగాణ సర్కార్ ఈ పథకం ద్వారా అర్హులైన వారందరికి చెక్కులను అందజేసింది. ఈ పథకం ప్రారంభంలో అర్హులైన వారందరికి రూ. 51వేలు అందజేశారు. ఖర్చు ఎక్కువ అవుతుండడంతో 2017-18లో ఈ పథకం ద్వారా రూ. 75, 116ను అందించేలా చర్యలు తీసుకుంది. 2018 మార్చి 19నుంచి రూ. లక్షా116లకు పెంచారు. నిరుపేద ఆడబిడ్డల ఇండ్లల్లో కల్యాణకాంతులను అందించడమే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. 2017-18 సంవ త్సరంలో 791మందికి లబ్ధిదారులకు రూ. 7కోట్ల 91లక్షల 91వేల 756, 2018-2019లో 1016మంది లబ్ధిదారులకు రూ. 10కోట్ల 17లక్షల, 17వేల, 856, అలాగే 2019-2020లో 921మంది లబ్ధిదారులకు రూ. 9కోట్ల 22లక్షల 6వేల 836, అదే విధంగా 2020 నుంచి నేటి వరకు 2350 మంది లబ్ధిదారులకు రూ. 23కోట్ల 52లక్షల 72 వేల 600ల చెక్కులను అందజేశారు. మొత్తం ఇప్పటి వరకు 5078మంది లబ్ధిదారులకు రూ. 50కోట్ల 83 లక్షల89వేల 048లను అందించారు. ఇటివలే నియోజకవర్గంలోని లబ్ధి దారులకు మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కాగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరంతరం కొనసాగుతుండడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో ఆసరా అయ్యింది..
మా బిడ్డ పెండ్లిని ఈ మధ్యనే చేశాను. కల్యా ణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే రూ. లక్షా 116ల చెక్కు వచ్చింది. ఈ నగదు మాకు ఎంతో ఆసరాగా నిలిచింది.
ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించలేదు
గతంలో ఏ ప్రభుత్వాలు ప్రజల స్థితిగతులను క్షేత్రస్థాయిలో ఆలోచించ లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చాక నిరుపేదల ఇండ్లల్లో సం తోషాలు నిండుతున్నాయి. ప్రభుత్వం ప్ర వేశ పెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు చాలా బాగున్నాయి.