షాద్‌నగర్‌టౌన్, జూలై 9 : తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా శుక్రవారం 28వ వార్డులో జడ్పీ చైర్మన్ అనితారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఆర్డీవో రాజేశ్వరి, కమిషనర్ లావణ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెట్లతోనే సకాలంలో వానలు పడుతాయని, పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సర్వర్‌పాషా, మాజీ వార్డు సభ్యుడు వేణుగోపాల్, చైతన్య యూత్ అధ్యక్షుడు రమేశ్, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
కొత్తూరు రూరల్, జూలై 9 : మండలపరిధిలోని ఇన్ముల్‌నర్వ శివారులోని సయ్యద్ హజరత్ జహంగీర్‌పీర్ దర్గాను శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ యాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు బాబాలకు దట్టి, చాదర్‌ను సమర్పించారు. అనంతరం ఇన్ముల్‌నర్వలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు.
అశోకుడి కాలాన్ని తలపిస్తున్నది
షాద్‌నగర్‌రూరల్, జూలై 9 : ఫరూఖ్‌నగర్ మండలంలోని కొండన్నగూడ, వెలిజర్ల, బుచ్చిగూడ గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ అనితారెడ్డి మొక్కలు నాటారు. రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు వృక్షాలుగా మారడంతో అశోకుడి కాలన్ని తలపిస్తున్నదన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి
షాబాద్, జూలై 9 : హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి, ఎంపీపీ ప్రశాంతిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని సంకెపల్లిగూడ, షాబాద్, ఎల్గొండగూడ గ్రామాల్లో వైస్ ఎంపీపీ లక్ష్మితో కలిసి హరితహారంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, సర్పంచులు సుబ్రమణ్యేశ్వరి, దర్శన్, ఎంపీటీసీ చెన్నయ్య, ఉప సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, నాయకులు మతీన్, రాజేందర్‌గౌడ్, వెంకట్‌యాదవ్, మల్లేశ్ పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
కొందుర్గు, జూలై 9 : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలాల్లో హరితహారంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ అనితారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగయ్య, జడ్పీటీసీ రాగమ్మ, తహసీల్దార్లు శ్రీకాంత్‌రెడ్డి, రాములు, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఎంపీవో విజయ్కుమార్పాల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు హఫీజ్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
చేవెళ్లటౌన్, జూలై 9 : కలిసి కట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మండల ప్రత్యేకాధికారి, అర్డీవో వేణుగోపాల్ రావు, గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో హరీశ్ కుమార్ తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా ముడిమ్యాలలో సర్పంచ్ స్వర్ణలత ఆధ్వర్యంలోఅభివృద్ధి సమావేశం నిర్వహించారు.
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి
నందిగామ, జూలై 9 : సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ అన్నారు. మండల కేంద్రంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెప్రగతిలో జడ్పీ వైస్ చైర్మన్ పాల్గొని పరిశీలించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమార్‌గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్రగతి పనులు పకడ్బందీగా చేపట్టాలి
షాబాద్, జూలై 9 : గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్ అన్నారు. కుర్వగూడ గ్రామాన్ని సందర్శించి వైకుంఠధామం, పల్లెప్రకృతివనాన్ని పరిశీలించారు. కుర్వగూడలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనం, చిన్నపిల్లల పార్కు బాగుందని సర్పంచ్, కార్యదర్శిని అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంత్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి గోవిందరావు, సర్పంచ్ సంధ్య, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ ఉన్నారు.
హరిత ఉద్యమంలో పాలుపంచుకోవాలి
కొత్తూరు రూరల్, జూలై 9 : కొడిచర్ల గ్రామంలో 4వ వార్డు సభ్యురాలు సరిత హరితహారం నిర్వహించారు. జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతి, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, స్పెషలాఫీసర్ దివ్య, కార్యదర్శి నాగమణి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు జనార్దన్‌యాదవ్ పాల్గొన్నారు.
పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలి
కేశంపేట, జూలై 9 : పల్లెలు పచ్చదనంతో కళకళలాడే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆర్డీవో రాజేశ్వరి సూచించారు. పాపిరెడ్డిగూడలో పల్లెప్రకృతి వనం కోసం భూమిని పరిశీలించారు. గ్రామంలో అభివృద్ధ్దిని చూసి ఆర్డీవో సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీవో చంద్రకళ, ఎంపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామాల్లో విస్తృత పర్యటన
మొయినాబాద్, జూలై 9 : పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించడానికి ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్ విస్తృతంగా పర్యటించారు. మండల ప్రత్యేకాధికారి నీరజతో కలిసి మండల పరిధిలోని పెద్దమంగళారం, ఎతుబార్పల్లి, తోలుకట్టా, నక్కలపల్లి గ్రామాల్లో పర్యటించారు. వారితో పాటు పెద్దమంగళారం సర్పంచ్ నరోత్తంరెడ్డి, ఉపసర్పంచ్ రజిత, కార్యదర్శి మల్లేశ్, తోలుకట్టా సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఎతుబార్పల్లి సర్పంచ్ నవనీత, నక్కలపల్లి సర్పంచ్ స్వప్నకుమారి ఉన్నారు.
అభివృద్ధి పనులపై సంతృప్తి
కొత్తూరు రూరల్, జూలై 9 : మండలపరిధిలోని శేరిగూడ బద్రాయపల్లి(ఎస్బీపల్లి)ని మండల స్పెషలాఫీసర్, జిల్లా మత్స్యశాఖ అధికారి సుకృతి ఆకస్మికంగా సందర్శించారు. అభివృద్ధి పనులను ఎంపీడీవో జ్యోతితో కలిసి పర్యవేక్షించారు. రోడ్ల వెంబడి, పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలను చూసి స్పెషలాఫీసర్ సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచ్ ప్రభాకర్‌ను అభినందించారు.