పూడూరు : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. చన్గోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీశైలం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం పూడూరు గ్రామానికి చెందిన మాసగళ్ల అంజయ్య (43) భార్య సుశీలతో గొడవపడ్డాడు, గత సంవత్సరం గ్రామంలోని ఓ వ్యక్తి నుంచి కుటుంబ అవసరాల మేరకు రూ. 2లక్షలు అప్పు చేయగా తిరిగి చెల్లించే విషయంలో తరుచుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి, మద్యం సేవించి వచ్చిన అంజయ్యతో పనికి వెళ్లకుండా తాగడం ఏమిటని చేసిన అప్పులు ఎలా చెల్లించాలని ఇద్దరి మద్య చిన్నపాటి గొడవ జరిగింది.
దీంతో చేసిన అప్పు చెల్లించలేనన్న మనస్థాపం చెందిన అంజయ్య ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతిడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసున మోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.