కడ్తాల్, జవనరి 9 : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పీఆర్టీయూ సంఘం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ మండలాధ్యక్షుడు చీమర్ల రాధాకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పద్మావతమ్మ, మండల బాధ్యులు కిశోర్‌కుమార్, లక్ష్మారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం : పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సరం 2024 క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, కేశవులు, రాజిరెడ్డి, నర్సింహ, కరుణాకర్‌రెడ్డి, అదృష్ణరావు, కృష్ణ, కరుణాకర్, పవన్ పాల్గొన్నారు.
స్కావెంజర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
కొత్తూరు :ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు, నందిగామ మండలాల పీఆర్టీయూ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో విజయసాగర్, రాఘవేందర్, ఆంజనేయులు, ప్రభాస్కుమార్, మధుసూదన్‌రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, బాబురావు, బసవేశ్వర్ పాల్గొన్నారు.
షాబాద్ : షాబాద్ మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ టీఎస్-2024 క్యాలెండర్‌ను మంగళవారం హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్‌కుమార్, పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్, కృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోవింద్, లక్ష్మణ్, సునీత, సంఘం సభ్యులు నర్సింహులు, అంజయ్య, జయరాజ్, రవీందర్, ఖాజాపాషా, ఆంజనేయులు, రియాజ్, రాము, సునీత, లింగం తదితరులున్నారు.