నందిగామ, జనవరి 2 : కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పాటు కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సోమవారం కొత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట యువకులు ధర్నా చేశారు. కొత్తూరు పరిధిలో అక్రమంగా నిర్మించిన ఓ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని, అదే విధంగా పాటు కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ డోలి రవీందర్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్ స్పందించి త్వరలోనే సర్వే నిర్వహించి పాటు కాలువ కబ్జాపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో యువకులు ఆందోళన విరమించారు.