సీఎం కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఇందుకోసం వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నది. మరోపక్క మన పథకాలను కాపీ కొట్టి ఆర్భాటంగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నది. ఇందుకు ఉదాహరణ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకమే. రైతుల కోసమనిపీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర సర్కార్ ప్రతిఏటా లబ్ధిదారుల సంఖ్యను అడ్డగోలుగా తగ్గిస్తూ వస్తున్నది.
సంవత్సరంలో ఇచ్చే అరకొర సాయానికి కూడా కొర్రీలు పెడుతూ ఆరేండ్ల కాలంలో జిల్లాలోని 1,09,160మంది రైతులను ఈ పథకానికి దూరం చేసింది. అదే సమయంలో ఏటారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతుబంధు’లో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 2018లో మొదటి విడుతలో కిసాన్ లబ్ధిదారుల సంఖ్య రంగారెడ్డి జిల్లాలో 1,93,189 మంది ఉండగా ప్రస్తుతం కేవలం 84,029 మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రం అందిస్తున్న రైతుబంధు సాయంతో పంటల సాగుకు అప్పులు చేయాల్సిన తిప్పలు తప్పాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరంభశూరత్వంపై మండిపడుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు జేజేలు పలుకుతున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ‘కేంద్ర ప్రభుత్వ పథకాల తీరు ‘ఆర్భాటమే తప్ప.. ఆచరణ శూన్యం’ అన్నట్లుగా ఉంటున్నది. ఇందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకమే ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు న్న రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని చేపట్టినప్పటికీ అమలు లో మాత్రం బోల్తా పడింది. తెలంగాణ ప్రభు త్వం 2018 సంవత్సరం నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో లబ్ధిదారులతోపాటు సాయం పెరుగుతూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పథకంలో మాత్రం లబ్ధిదారులతోపాటు సాయం సైతం తగ్గుతూ వస్తున్న ది. కొర్రీలు పెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో 2018లో మొదటి విడుతలో 1,93,189 మందికి రూ.38.63కోట్ల సాయాన్ని కేంద్రం అందించింది. గత జూలై నె లాఖరున అందించిన 14వ విడుత సాయంలో మాత్రం 84,029 మందికి కేవలం రూ.16.80 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకొన్నది. లక్షకు పైగా రైతులకు మొండి చెయ్యి చూపించింది.’ వ్యవసాయ పెట్టుబడులకు రైతులు ఇ బ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రై తు బంధు పథకానికి శ్రీకారం చుట్టి 2018 వానకాలం సీజన్ నుంచి రైతులకు సాయం అందిస్తూ వస్తున్నారు. ఆరంభంలో ఎకరాకు రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.8వేల సాయం అందించి న ప్రభుత్వం ఆ తర్వాత సాయాన్ని రూ.5వేలకు పెంచి రెండు సీజన్లకు ఎకరాకు రూ.10వేల చొ ప్పున అందిస్తూ వస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 2018 వానకాలం సీజన్‌కు 2,47,694 మంది రైతులకు రూ.255కోట్ల రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం అందించింది. చివరగా 2023 వానకాలం సీజన్లో 11వ విడుతగా 3,94,066 మంది రైతులకు రూ.319కోట్ల సాయాన్ని రైతుల బ్యాంకు ఖా తాల్లో జమ చేసింది. 11 విడుత ల్లో మొత్తం రూ.3,337కోట్ల సా యాన్ని తెలంగాణ ప్రభుత్వం జిల్లా రైతులకు పెట్టుబడి సా యంగా అందించింది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం 2018 సంవత్సరం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కొత్త పథకాన్ని అమలు చేసింది. ప్రతి యేటా మూడు విడుతల్లో రూ.2 వేల చొప్పున రూ.6వేలను అందజేస్తున్నది. మొదటి సంవత్సరం ఒక విడుతలోనే రూ.2వేల చొ ప్పున 1,93,189 మందికి రూ.38.63కోట్లను అందించింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి సాయం పొందే రైతుల సంఖ్య క్రమక్రమేణా తగ్గుతూ వస్తున్నది. గత జూలైలో చివరి సారిగా 14వ విడుతలో 84,029 మంది రైతులకు మాత్రమే రూ.16.80కోట్లు అందించింది. ఈ లెక్కన రంగారెడ్డి జిల్లాలో లక్షకు పైగా రైతులకు మొండి చెయ్యి చూపించినట్లు అయింది. 14 విడుతల్లో ఇప్పటి వరకు కేంద్రం ఈ పథకంలో కేవలం రూ.452కోట్ల సాయాన్ని మాత్రమే అందించింది.
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి రైతు బంధు సాయాన్ని అందజేస్తూండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అర్హతకు సవాలక్ష ఆంక్షలు, నిబంధనలను పెట్టింది. 2019 ఫిబ్రవరిలోపు పట్టాదార్ పాసు పుస్తకాలు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అర్హులని నిర్ణయించడంతో ఆ తర్వాత పాసు పుస్తకాలు పొందిన చాలామంది రైతులు పీఎం కిసాన్ పథకం కింద సాయాన్ని పొందలేక పోయారు. ఈ పథకం కింద సాయం పొందుతున్న రైతులు ఆదాయ పన్ను చెల్లించినా, మరణించినా, ఏదైనా ప్రభు త్వ ఉద్యోగం వచ్చినా ఆటోమెటిక్‌గా రైతుల పేరు తొలగిపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ప్రతి సీజన్లోనూ కొత్త వారికి అవకాశం కల్పించకపోవడంతో కొత్తవారు పీఎం కిసాన్ పథకం కింద సాయం పొందలేక పోతున్నారు. కేంద్ర విధానంపై జిల్లా రైతాంగం మండిపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం అమలు చేస్తున్న మరే పథకం కూడా సాటిరాదని రైతాంగం పేర్కొంటున్నది.