కుత్బుల్లాపూర్, ఏప్రిల్5 : ఆర్థిక ఇబ్బందులతో ప్లంబింగ్ కాంట్రాక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిషా రాష్ట్రం బేతాల్పూర్ ప్రాంతానికి చెందిన ఇంద్రదుయ్య (26) గత కొంత కాలం కిందట నగరానికి వలస వచ్చి సుభాష్ నగర్లో తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వృత్తిరీత్యా ప్లంబింగ్ కాంట్రాక్టర్ గా పనిచేసుకుంటున్నాడు. కాగా, సోదరుడికి ఫోన్ చేసి తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తాను చనిపోతున్నాను అని చెప్పి ఫోను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.
శనివారం తన రూమ్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి ఓనర్ వెళ్లి తలుపులు తట్టగా ఎంతకు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో చూడగా ఫ్యాన్‌కు వైరుతో ఉరివేసుకొని వేలాడుతు కనిపించాడు. ఇంటి ఓనర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.