పెద్దఅంబర్‌పేట, ఆగస్టు 28 : ఈ రోజు ఎక్కడెక్కడ మొక్క లు నాటారు? ఏయే ట్రాక్టర్లలో ఏయే నర్సరీల నుంచి మొక్కలు తీసుకెళ్లారు? ఏ రకమైన మొక్కలు ఎన్ని తీసుకెళ్లారు? గతంలో నాటిన మొక్కల్లో చనిపోయినవి ఎన్ని ఉ న్నాయి? ఇంకా లక్ష్యం చేరుకునేందుకు ఎక్కడెక్కడ మొక్కలు నాటాల్సి ఉన్నది? విద్యాసంస్థలు, ప్రైవేటు కంపెనీ ల్లో ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు? ఇలా హరితహారంపై మున్సిపల్ అధికారులు పక్కాగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారంతో ప్రతివార్డును పచ్చగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఏడాది లక్ష మొక్కలు నా టేందుకు సిద్ధమవుతున్న మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీందర్‌రెడ్డి తెలిపారు. విభాగాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని మొ క్కలు నాటాలో పక్కాగా సన్నద్ధమవుతున్నారు. నాటిన మొక్కల లెక్కలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపుతున్నారు.
హరితహారంలో భాగంగా మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంచుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు వార్డుల్లో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద పెద్ద కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో మొ క్కల పంపిణీ చేపట్టారు. ఇందుకోసం ముందుగానే ఆయా ప్రాంతాల్లో సమాచారం అందించారు. మొక్కలు పంచడ మే కాదు, వాటిని సంరక్షించాలని సూచనలు చేస్తున్నారు. మొక్కల అవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. పలుచో ట్ల ప్రజలే స్వచ్ఛందంగా మొక్కలు తీసుకెళ్తున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కల కార్యక్రమంలో భాగంగా దా దాపు 50 వేల మొక్కలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలోని రహదారులకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే గతంలో నాటిన మొక్కలను స్వయం గా పరిశీలిస్తున్నారు. ఇంకా ఏయే మార్గాల్లో మొక్కలు నా టాలో గుర్తిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా పెద్దగా స్థలంలే ని చోట ఒక వరుసలో మొక్కలు నాటనున్నారు. రహదారులు విశాలంగా ఉన్న ప్రాంతాల్లో రెండు లేదా అంతకం టే ఎక్కువ వరుసల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా రహదారులకు ఇరువైపులా దాదాపు 25 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని పల్లె, పట్టణ ప్రకృతివనాలతోపాటు బృహత్ పట్టణ వనాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆయా వనాల్లో ఇప్పటికే ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఇంకా ఎన్ని మొక్కలు నాటేందుకు అవకాశం ఉన్నదో లెక్కలు తీస్తున్నారు. ఈ ఏడాది ఆయా వనాల్లో 3500కు పైగా మొక్కలు నాటనున్నారు. వీటితోపాటు ఆయా వార్డుల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నచోట మొక్కలు నాటాలని నిర్ణయించారు. విద్యా సంస్థలు, ప్రై వేటు కంపెనీల్లో ఆయా యాజమాన్యాల సహకారంతో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, గ తంలో నాటిన మొక్కల్లో ఎన్ని పెరగలేదో గుర్తించి, వాటి స్థానంలో మళ్లీ కొత్తవి నాటనున్నారు. మొత్తంగా మున్సిపాలిటీలో లక్ష మొక్కలు నాటేందుకు ఐదు నర్సరీల్లో దా దాపు లక్షా పది వేల మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు నాటడమే కాదు, ఏ రోజు ఎన్ని మొక్కలు నాటారు? ఏ యే మొక్కలు నాటారు? ఇంకా ఎన్ని మొక్కలు నాటాల్సి ఉన్నది, లక్ష్యాన్ని చేరుకోవాలంటే రోజుకు ఎన్ని మొక్కలు చొప్పున నాటాల్సి ఉన్నది? తదితర విషయాలను ఎప్పటికప్పుడు నోట్ చేయనున్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నాటిన మొక్కల లెక్కలు పంపనున్నారు.
మున్సిపాలిటీలోని అన్ని వార్డులను పచ్చదనంతో నింపడమే ల క్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. హరితహారం లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు వేస్తు న్నాం. వార్డుల వారీగా ఎన్ని మొక్కలు నాటుతున్నాం, ఇంకా ఎన్ని నాటాల్సి ఉన్న దో ఇలా అన్ని లెక్కలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీటి బాధ్యతలను అప్పగించాం. వీటిపై రోజూ సమాచారం తెప్పించుకుంటున్నాం. వెనుకబడితే మ రింత వేగం పెంచేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ ఏడాది లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందరి సహకారంతో తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుని మున్సిపాలిటీని పచ్చగా మారుస్తాం.
– ఎస్ రవీందర్‌రెడ్డి, కమిషనర్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ