మరో 42 ఎంజీడీల నీరు
రానున్న వేసవిలో జీహెచ్ఎంసీతోపాటు ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందిస్తామని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు.
- ప్రస్తుతం 565 మిలియన్ గ్యాలన్లు.. మే నాటికి 42 ఎంజీడీలు అదనం
- జూన్ నాటికల్లా ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ – 2 పూర్తి
- 50 ఎంజీడీల నీటి సరఫరా
- అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు.. ట్యాంకర్లు, ట్రిప్పుల సంఖ్య పెంపు
- వేసవిలో సమృద్ధిగా నీరందించడమే లక్ష్యంగా జలమండలి యాక్షన్ ప్లాన్
సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రానున్న వేసవిలో జీహెచ్ఎంసీతోపాటు ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందిస్తామని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. వేసవిలో నీటి డిమాండ్ దృష్ట్యా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేశామని, నీటి సరఫరాకు ఎటువంటి ఢోకా లేదని, అవసరం మేరకు రిజర్వాయర్ల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. మంగళవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, రెవెన్యూ, ట్రాన్స్మిషన్, ఓ అండ్ ఎం విభాగాల ముఖ్య అధికారులతో ఎండీ దానకిశోర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ వేసవిలో అదనంగా 42 ఎంజీడీల నీరు
జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నదని, మరో 42 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దానకిశోర్ చెప్పారు. నగరంతోపాటు ఓఆర్ఆర్ లోపలి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ వేసవి మే నెలాఖరు నాటికి 42 ఎంజీడీల నీరు అదనంగా సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు. ఇందులో నగర పరధిలో 22 ఎంజీడీలు, ఓఆర్ఆర్ లోపలి గ్రామాలకు 20 ఎంజీడీల నీరు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెలలో అదనంగా 22 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో ఇప్పటికే 14 ఎంజీడీలు ఇస్తుండగా.. నెలాఖరుకు మరో 8 ఎంజీడీల నీరు సరఫరా చేయనున్నట్లు పేరొన్నారు. వచ్చే నెలలో12, మేలో 8 ఎంజీడీల నీరు అదనంగా సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎండీ వివరించారు.
ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ – 2కు 50 ఎంజీడీల నీరు
ఈ జూన్ నాటికి ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎండీ వెల్లడించారు. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు ఇప్పటికే 20 ఎంజీడీల నీరు ఇస్తుండగా.. అవసరాన్ని బట్టి మరో 30 ఎంజీడీల నీరు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఈ ప్రాంత ప్రజలకు మొత్తం 50 ఎంజీడీల నీరు సరఫరా అవుతుందని ఎండీ పేరొన్నారు.
బోర్ వెల్స్ మరమ్మతులు
ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్ వెల్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించాలని అధికారులకు ఎండీ సూచించారు. అవసరమైన చోట మాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టం (ఏఎంఎస్) కింద మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అదనపు ట్యాంకర్లు, ట్రిప్పులు
అవసరమైన చోట్ల అదనంగా ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఎండీ ఆమోదం తెలిపారు. నగరవ్యాప్తంగా ప్రస్తుతం 74 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. అదనంగా మరో 3 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అవసరం మేరకు ట్యాంకర్లు, ట్రిప్పుల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో డిమాండును బట్టి నీటి సరఫరా సమయాన్ని పెంచాలన్నారు. ఫిల్లింగ్ స్టేషన్లలో కరెంటు కోతలు, మోటారు రిపేర్లు, తదితర సమస్యలు తలెత్తినప్పడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
కలుషిత జలాల నివారణపై దృష్టి
కలుషిత నీరు సరఫరా కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. వాటర్ లీకేజీలు, సీవరేజి ఓవర్ ఫ్లోలను ఎప్పటికప్పుడు పరిషరించేలా చూడాలన్నారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన సిల్ట్‌ను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఎకడైనా మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే వెంటనే పునర్మిర్మాణం చేపట్టాలని, మ్యాన్ హోళ్ల కవర్లు కనిపించని స్థితిలో ఉన్నా.. వెంటనే కొత్త మూతలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రంజాన్ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు
రంజాన్ మాసం దృష్ట్యా అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఎండీ సూచించారు. ఎకడా సీవరేజి ఓవర్ ఫ్లో వంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిషరించాలని పేరొన్నారు. దీనికోసం డివిజన్కొక మినీ జెట్టింగ్ మిషన్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ -2 స్వామి, ఓ అండ్ ఎం, ట్రాన్స్ మిషన్ సీజీఎంలు, జీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

